THANGALAAN RELEASE UPDATE: తంగలాన్ రిలీజ్ డేట్పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..అల్లు అర్జున్ వాయిదా డేట్ను లాక్ చేసుకున్న విక్రమ్

Thangalaan Release Update: తంగలాన్ రిలీజ్ డేట్పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..అల్లు అర్జున్ వాయిదా డేట్ను లాక్ చేసుకున్న విక్రమ్  

చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా పా.రంజిత్‌ (Pa Ranjith) దర్శకత్వంలో తంగలాన్‌ (Thangalaan) సినిమా చేస్తున్నారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్‌ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. విక్రమ్కు ఇది 61వ మూవీ. స్టూడియో గ్రీన్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ (MalavikaMohanan)గా కనిపించనుంది.

ఈ మూవీ జనవరి 26న రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా విడుదల వాయిదాపడుతూనే వస్తుండటంతో చియన్స్ ఫ్యాన్స్ నుండి ప్రెషర్ పెరుగుతూ వస్తుంది.ఇక దీంతో ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానున్నట్లు కొత్త పోస్టర్ తో మేకర్స్ కన్ఫమ్ చేసేశారు. అదికూడా పోస్టుపోన్ అయ్యింది. ఇప్పుడు మరోసారి మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. ఆగస్ట్ 15న తంగలాన్  థియేటర్స్ లో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ మూవీ మొదటగా ఆగస్ట్ 15న రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఎట్టకేలకు పుష్ప 2 డిసెంబర్ 6కి పోస్టుపోన్ కావడంతో..చిన్న సినిమాలతో పాటు ఆగస్ట్ 15న రిలీజ్ అయ్యేందు రెడీ అయ్యాయి. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుంది.

ఈ  మూవీలో పార్వతి ముఖ్య పాత్రలో నటిస్తుండగా..మరో  కీలక పాత్రలో హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్లాగిరోన్ కనిపించనున్నాడు. ఇతర పాత్రల్లో పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై, ప్రీతికరణ్ నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.

©️ VIL Media Pvt Ltd.

2024-07-01T06:51:32Z dg43tfdfdgfd