TRIPTI DIMRI: వైరల్ అవుతున్న త్రిప్తి పొట్టి డ్రెస్సు.. ధర తెలిస్తే షాకవుతారు!

Tripti Dimri: వైరల్ అవుతున్న త్రిప్తి పొట్టి డ్రెస్సు.. ధర తెలిస్తే షాకవుతారు!

యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాధించుకుంది నార్త్ బ్యూటీ  తృప్తి డిమ్రి. ఈ సినిమాలో తన గ్లామర్ తో కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది ఈ బ్యూటీ. నిజానికి యానిమల్ సినిమాలో రష్మిక హీరోయిన్ కానీ, ఆమెకన్నా ఎక్కుడ పాపులారిటీ సాధించింది  తృప్తి డిమ్రి. అందుకే చాలా మంది యూత్ కి లేటెస్ట్ క్రష్ గా మారిపోయింది. దాంతో.. ఆమె తరువాతి సినిమాలపై క్రేజీ బజ్ క్రియేట్ అవుతోంది. 

ఈ నేపధ్యంలోనే తాజాగా ఆమె హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్యాడ్ న్యూస్. విక్కీ కౌశల్ హీరోగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. కానీ,  తృప్తి డిమ్రి మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. అందరి చూపులు ఆమె మీదే పడ్డాయి. అందుకు కారణం ఆమె ధరించిన బ్లాక్ కలర్ స్కర్ట్. పొట్టిగా ఉన్న ఈ స్కర్ట్ లో అందాలు ఆరబోస్తూ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది  తృప్తి. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

అయితే.. కొంతమంది ఆమె వేసుకున్న స్కర్ట్ ఖరీదు తెలుసుకుందాం అని ట్రై చేయగా ధర తెలిసి నోరెళ్లబెడుతున్నారు. ఆ స్కర్ట్ ధర అక్షరాలా నాలుగు లక్షల యాభై వేలు అని తెలిసింది. దాంతో.. నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఇంత పొట్టిగా ఉన్న ఈ స్కర్ట్ ధర నాలుగు లక్షలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం  తృప్తి డిమ్రి ధరించిన ఆ పొట్టి స్కర్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

©️ VIL Media Pvt Ltd.

2024-06-30T06:17:24Z dg43tfdfdgfd