ఇంటర్ లో రైతు బిడ్డకు బెస్ట్ ర్యాంక్ కానీ.. గోల్ మాత్రం ఇది కాదట !

ఈ విద్యార్థిని పేరు లక్కీ. వ్యవసాయ కుటుంబానికి చెందిన లక్కీ ఇటీవల విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించి, అందరి చేత అభినందనలు అందుకుంది. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన లక్కీ తన ఇంటర్ విద్యాభ్యాసాన్ని ధర్మారం ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కళాశాలలో సాగించి ఎంపీసీ ఫస్టియర్ లో 460 మార్కులతో మంచి ర్యాంక్ తో తన సత్తా చాటింది.

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన శిల్పా సింధూర, విజయేందర్ దంపతుల కుమార్తె లక్కీ. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన లక్కీ 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ధర్మారం ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించింది. బాల్యం నుండే చదువుపై మక్కువ ఉన్న లక్కీ ఇంటర్మీడియట్ విద్యను సైతం అదే సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో సాగించింది.

రామయ్య తండ్రి భద్రాద్రి లో వెలిసినట్లు మొదటగా చెప్పిన మహా భక్తురాలు ఎవరంటే ?

తాజాగా విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి తన ప్రతిభను కనబరిచింది లక్కీ. తాను ఉత్తమ మార్కులు సాధించడం పై లోకల్18 లక్కీ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ప్రోత్సాహ, కళాశాల అధ్యాపకుల సహకారంతో ఉన్నత మార్కులు సాధించడం జరిగిందన్నారు. అలాగే ప్రతిరోజూ ప్రత్యేక టైం టేబుల్ ద్వారా తాను పరీక్షకు సిద్ధమయ్యానని, అదే తాను ఉన్నత మార్కులు సాధించేందుకు దోహదపడిందన్నారు.

ఇంటర్ ఫలితాలలో.. దుమ్ము లేపిన కూలీ కూతురు !

భవిష్యత్తులో తాను ఇంజనీర్ కావాలన్నదే లక్ష్యంగా ఎంచుకున్నట్లు లక్కీ తెలిపారు. ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన లక్కీ ఇంటర్ ఫలితాలలో 470 కి 468 సాధించి, 2 మార్కుల తేడాతో బెస్ట్ ర్యాంక్ సాధించడంపై తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంజనీర్ కావాలన్న లక్ష్యంతో ఉన్న లక్కీ, తన భవిష్యత్ లొ ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అందరం ఆశిద్దాం..!

2024-04-27T17:41:36Z dg43tfdfdgfd