కూర్మనాయకి ప్రాజెక్టులోకి శివాజీకి వెల్కమ్

కూర్మనాయకి ప్రాజెక్టులోకి శివాజీకి వెల్కమ్

ఇటీవల వచ్చిన  ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌తో రీ  ఎంట్రీ ఇచ్చిన శివాజీ..  నటుడిగా మళ్లీ బిజీ అవుతున్నాడు.  ‘కూర్మనాయకి’ అనే చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. శనివారం శివాజీ బర్త్‌‌‌‌‌‌‌‌డే సందర్భంగా విషెస్ తెలియజేసిన టీమ్... ఈ ప్రాజెక్టులోకి వెల్కమ్ చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. 

ఈ పోస్టర్ గమనిస్తే ఇందులో శివాజీ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంపార్టెన్స్ ఉండేలా తెలుస్తోంది. ఇప్పటికే  రెండు షెడ్యూల్స్  పూర్తవగా, మూడో షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో శివాజీ జాయిన్ అయ్యారు. ఇదొక సోషియో ఫాంటసీ మూవీ. వరలక్ష్మీ శరత్ కుమార్, సాయి కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  మహా విష్ణు అవతారాల్లోని కూర్మావతారం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు హర్షవర్థన్ కడియాల. కె విజితా రావ్ నిర్మిస్తున్నారు.  శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నాడు.

©️ VIL Media Pvt Ltd.

2024-06-30T03:01:52Z dg43tfdfdgfd