`కల్కి`కి అసలు గేమ్‌ ఇప్పుడే స్టార్ట్.. నిలబడుతుందా? డీలా పడుతుందా?

ప్రభాస్‌ హీరోగా నటించిన `కల్కి 2898ఏడీ` చిత్రం నాలుగు రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తొలి వీకెండ్‌ పూర్తయ్యింది. గురువారం విడుదలైన ఈసినిమా ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ ని రాబట్టిన విషయం తెలిసిందే. ఇండియన్‌ టాప్‌ 3 ఓపెనింగ్స్ ని కలెక్ట్ చేసింది. 191.5 కోట్లు వసూలు చేసింది. మొదటి రెండు స్థానాల్లో `ఆర్‌ఆర్‌ఆర్‌`, `బాహుబలి 2` చిత్రాలున్న విషయం తెలిసింది. అయితే నాలుగు రోజుల వీకెండ్ కావడంతో ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది. నాలుగు రోజులు కుమ్మి వదిలేసింది. నాలుగు రోజుల్లో ఈ మూవీ ఏకంగా 555కోట్లు వసూలు చేసినట్టు టీమ్‌ వెల్లడించింది. 

సుమారు రూ.230కోట్ల షేర్‌ వచ్చింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ కావాలంటే ఇంకా 150కోట్ల షేర్‌(రూ.375కోట్ల బిజినెస్‌) రావాలి. అంటే మూడు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టాల్సి ఉంది. అయితే ఓవర్సీస్‌లో ఆల్‌ టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసిందీ మూవీ. నాలుగు రోజులు 93కోట్లు వసూలు చేసింది. అలాగే నార్త్ లోనూ దుమ్ము లేపింది. అక్కడ కూడా 115కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. ఇక్కడ బ్రేక్‌ ఈవెన్‌కి ఇంకా ముప్పై కోట్లు రావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఈ వారం మొత్తం కలెక్షన్లు స్టడీగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. 

అయితే సోమవారం నుంచి అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. వీకెండ్స్ లో పరిస్థితి వేరు. జనం సినిమా చూడ్డం కోసం ఆసక్తి చూపిస్తారు. కానీ ఇప్పుడు వీక్‌ డేస్‌లో ఎవరి పనుల్లో వాళ్లు ఉంటారు. సినిమాలకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వరు. కేవలం ఫ్రీ టైమ్‌లోనే చూస్తుంటారు. యూత్‌ ఫ్లోటింగ్‌ ఉంటుంది. దీంతో కలెక్షన్లు బాగా డ్రాప్‌ అవుతుంటాయి. సగానికిపైగా పడిపోతుంటాయి. ఈ క్రమంలో సోమవారం 40-50 శాతం కలెక్షన్లు ఉంటే సినిమా నిలబడినట్టు అర్థం. 30శాతం కంటే పడిపోయిందంటే సినిమా డ్రాప్ అవుతుందని అర్థం. దీంతో `కల్కి`కి ఇప్పుడు అసలు గేమ్‌ స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. 

అయితే తెలుస్తున్న సమాచారం మేరకు సోమవారం అర్బన్‌ ఏరియాలో మాత్రం ఈ మూవీకి బుకింగ్స్ బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. సీటీ, అర్బన్‌ ఏరియాలో ఫర్వాలేదు, కానీ రూరల్‌ ఏరియాలో మాత్రం బాగా డ్రాప్‌ ఉందని అంటున్నారు. ఏపీలో వర్షాల కారణంగా అది సినిమాపై గట్టి దెబ్బనే పడుతుందని చెబుతున్నారు. మరి ఓవరాల్‌గా మండే ఎంత కలెక్ట్ చేస్తుంది, సాయంత్రానికి ఎంత ఫిల్‌ అవుతాయనేదాన్ని బట్టి ఈ సినిమా నిలబడుతుందా? డీలా పడుతుందా అనేది తెలుస్తుంది. మొత్తంగా మాత్రం `కల్కి`కి అసలు గేమ్‌ స్టార్ట్ అయ్యిందని, అసలు పరీక్ష ఇప్పుడే స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. న

ఇక ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్‌, దుల్కర్‌, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటించిన `కల్కి` చిత్రంలో సైన్స్ ఫిక్షన్‌, మైథలాజికల్‌ అంశాల మేళవింపుతో సరికొత్త విజువల్‌ ట్రీట్‌గా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మూవీని అశ్వినీదత్‌ సుమారు 600కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.

2024-07-01T12:05:50Z dg43tfdfdgfd