ప్రేమ - ప్రతీకారం.. మోసం చేసిన ప్రియుడు, అతని తండ్రిని పెళ్లి చేసుకున్న యువతి

సోషల్ మీడియాలో మనం చాలా రకాల రివెంజ్ స్టోరీలు చూస్తుంటాం. తనను మోసం చేసిన ప్రియుడిపై ప్రియురాలు పగ తీర్చుకున్న స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పగ తీర్చుకోవడం కోసం ఆ యువతి.. ప్రియుడి తండ్రిని ఎంచుకుంది. అతన్ని పెళ్లి చేసుకుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో, పెళ్లి ద్వారా పగ తీర్చుకున్న ప్రియురాలు ఎవరో తెలియలేదు. ఈ విషయాన్ని ప్రియుడి సోదరి సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

ఆ యువతి పగ తీర్చుకునేందుకు ప్రియుడి తండ్రిని పెళ్లి చేసుకుని, సవతి తల్లిగా ఇంటికి వచ్చిందని ఆ పోస్ట్‌లో ప్రియుడి సోదరి చెప్పింది. "నా సోదరుడు మరో వివాహం చేసుకున్నాడు. దాంతో ఆమె సవతి తల్లిగా మారి.. మా కుటుంబంలో సమస్యలు సృష్టించింది" అని ఆ మహిళ తెలిపింది. ఆమె చేసిన పనికి మేమంతా షాక్ అయ్యాం.. అంటూ ఏం జరిగిందో ప్రియుడి సోదరి వివరించింది.

---- Polls module would be displayed here ----

"నా తమ్ముడి పెళ్లి రోజున వధువు మాత్రమే తెల్లటి దుస్తులు ధరించాల్సి ఉంది. ఐతే, ఆ రోజు.. ఆమె కూడా తెల్లటి దుస్తులు ధరించింది. అమె అలా ఎందుకు చేసిందో మొదట మాకు అర్థం కాలేదు. వరుడు, వధువు తమ బంధువులతో ఫొటోలు దిగుతుండగా.. ఆమె (సవతి తల్లి) కూడా వారి పక్కన నిల్చొని ఫొటోలు దిగింది. ఆ తర్వాత ఆమె సవతి తల్లిగా మారింది" అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్ టాక్ ద్వారా ప్రియుడి సోదరి.. తమ కష్టాలను చెప్పుకుంది.

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కొంతమంది తమ స్పందనను తెలియజేశారు. కొంతమంది ఆ యువతికి సపోర్టుగా నిలిచారు. ఆమె ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిందనీ, ఎత్తుకు పై ఎత్తు వేసిందని కొందరు మెచ్చుకోగా.. మరికొందరు.. దీని వల్ల ఆమె ఏం సాధించింది.. ఆమె తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది అని మరొకొందరు స్పందించారు. తన మాజీ ప్రియురాలిని పెళ్లి చేసుకున్న తన తండ్రితో ఇక ఆ యువకుడు ఎప్పటికీ మాట్లాడలేడని మరికొందరు అభిప్రాయపడ్డారు.

2024-04-26T02:35:06Z dg43tfdfdgfd