గూడూరులో అరుదైన జైన పద్మావతి శిల్పాలు

పాలకుర్తి, జూన్‌ 30 : మనకు కనిపించే నాగదేవతల విగ్రహాలన్నీ ఒకటి కాదని, అందులో జైన యక్షిణి పద్మావతిదేవి శిల్పాలు ఉంటాయని చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో రెండు అరుదైన రాష్ట్ర కూటుల కాలం నాటి జైన యక్షిణి శిల్పాలను ఆయన గుర్తించారు. ఆదివారం వాటి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు శిల్పాల్లో ఒకటి.. గ్రామంలోని పోచమ్మ గుడి చెట్టు కింద కొమటోళ్ల బొమ్మలు అని స్థానికులు పిలిచే శిల్పాల్లో ఉన్నదని, దానిలో శిల్పకళ ఉట్టి పడుతున్నదని తెలిపారు.

నడుము నుంచి పైభాగం వరకు మానవ స్త్రీ రూపం, దిగువ భాగం మెలితిరిగిన పాము తోకతో ఉన్నట్టు తెలిపారు. నల్లని పొడవైన గ్రానైట్‌ శిలపై నర నాగ దేవత రూ పంలో ఉన్నట్టు చెప్పారు. తల పై 9 పడగల సర్పం గొడుగు పట్టిందని, రెం డు చేతుల్లో రెండు తామర మొగ్గలు ఉన్నాయని చెప్పారు. జైన దేవతల విగ్రహాలను చెట్టుకు ఒరిగించి పెట్టారని ఆయన తెలిపారు. ఈ రెండు శిల్పాలను గ్రామస్థులు సంరక్షించు కోవాలని కోరారు.

2024-06-30T19:34:35Z dg43tfdfdgfd