ACTOR RAGHUBABU CAR INCIDENT: నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం

Actor Raghubabu Car Incident In Nalgonda: కారు, బైక్ ను ఢీకొట్టిన ఘటనలో బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందిన ఘటన నల్లగొండలో జరిగింది. నల్లగొండ బైపాస్ రోడ్డులో నిన్న(ఏప్రిల్ 17న) సాయంత్రం ఈ ఘటన జరిగింది. నటుడు రఘుబాబు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?   

50 మీటర్లు బైకును లాక్కెళ్లిన రఘుబాబు కారు

నల్లగొండ పట్టణంలోని నార్కెట్ పల్లి- అద్దంకి రహదారిపై సినీ నటుడు రఘుబాబు కారును బైక్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నల్లగొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు(51) చనిపోయారు. రఘుబాబు వెళ్తున్న కారును బైక్‌పై వేగంగా వచ్చిన జనార్ధన్‌ రావు అదుపు తప్పి ఢీ కొట్టడంతోనే ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో రఘుబాబుది ఎలాంటి తప్పులేదని స్థానికులు చెప్పారు. రఘుబాబు కారు వేగంగా వస్తుండటంతో బైకును సుమారు 50 మీటర్ల దూరం లాక్కెళ్లినట్లు స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో జనార్థనరావు అక్కిక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.  

జనార్థన్ రావే రఘుబాబు కారును ఢీకొట్టారా?

ప్రస్తుతం సంధినేని జనార్థనరావు శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయన నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. కొంతమంది మిత్రులతో కలిసి కలిసి పట్టణ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీ దగ్గర దత్త సాయి వెంచర్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వెంచర్‌కు వెళ్లి వస్తుండేవారు. ఎప్పటిలాగే బుధవారం కూడా వెంచర్ దగ్గరికి వెళ్లారు. సాయంత్రం 5 గంటల తర్వాత తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న KA 03  MP 69 14 నెంబర్ గల BMW కారును జనార్దన్ రావు అదుపు తప్పి ఢీ కొట్టింది. కారు వేగంగా వెళ్తున్న నేపథ్యంలో జనార్దన్ రావుకు తీవ్ర గాయాలు అయ్యాయి. కొద్ది సేపట్లోనే ఆయన అక్కడిక్కడే చనిపోయాడు. మృతుని భార్య నాగమణి కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వయిరీ మొదలు పెట్టారు. జనార్దన్ రావు స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామం. జనార్దన్ రావుకు భార్య నాగమణి, కుమార్తె,కుమారుడు ఉన్నారు. ప్రమాదం అనంతరం నటుడు రఘుబాబు వేరే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అటు జనార్థన్ రావు మృతిపట్ల నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఆయన సోదరుడు నల్లగొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆయన ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళి అర్పించారు. ఆయన లాంటి సిన్సియర్ నాయకుడిని పార్టీ కోల్పోవడం చాలా బాధాకరమని వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భూపాల్ రెడ్డి భగవంతుడిని ప్రార్థించారు. ఇవాళ జనార్థన్ రావు అంత్యక్రియలు జరగనున్నాయి.  

Read Also: భర్తను కోల్పోయిన ఆమె రెండో పెళ్లికి ఒప్పుకోదు - కానీ, ఆ ‘కోరిక’ తీర్చాలంటుంది.. గుండె బరువెక్కించే మూవీ ఇది

2024-04-18T03:20:50Z dg43tfdfdgfd