KALKI PUBLIC TALK: ఖాన్‌లు కాదు ప్రభాస్‌యే నెం.1.. కల్కికి నార్త్ ఆడియన్స్ రెస్పాన్స్

"గోవా, న్యూ దిల్లీ, బాంబే ఇలాంటి చోట్లకి ఫంక్షన్స్‌కి వెళ్తే తెలుగువాళ్లకి గుర్తింపు లేదు. గోవా ఫిలిం ఫెస్టివల్‌కి వెళ్లిన నాకు అక్కడ మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు.. అక్కినేని నాగేశ్వరరావు గారి బొమ్మ లేదు... ఇదీ మన గుర్తింపు. మనం బాంబే, దిల్లీ, గోవా వరకూ కూడా వెళ్లలేకపోయాం." 2007లో వజ్రోత్సవ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలు ఇవి. ఆరోజు ఈ మాటలు చిరు నోటి నుంచి వచ్చినా కూడా దాదాపు సౌత్ ఇండియన్ యాక్టర్స్ అందరి అభిప్రాయం ఇదే. కానీ కాలం ఎంత విచిత్రమైంది కదా .. దశాబ్ద కాలం తిరిగే సరికి సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ దశ, దిశ అన్నీ మారిపోయాయి. ఇప్పుడు బాంబే, గోవా, దిల్లీ కాదు.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ తెలుగు సినిమా దూసుకుపోయింది.. సౌత్ ఇండియన్ చిత్రాలు బాలీవుడ్‌ను రాజ్యమేలుతున్నాయి.

బాహుబలితో మొదలైన ఈ తుపాను కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప, కాంతార, సలార్, హనుమాన్ ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ'తో పెద్ద సునామీగా మారిపోయింది. అసలు కల్కికి ఇప్పుడు నార్త్‌లో వచ్చిన రివ్యూలు, థియేటర్ దగ్గర పబ్లిక్ రెస్పాన్స్ చూస్తుంటే తెలుగోడికి, దక్షిణాది అభిమానులకి గర్వంతో గుండె ఉప్పొంగిపోతుంది. అసలు కొంతమంది నార్త్ ఆడియన్స్ అయితే తెలుగు చిత్రాలకి, సౌత్ సినిమాలకి సెల్యూట్ అని చెబుతుంటే ఇంతకన్నా ఏం కావాలి అనిపిస్తుంది. ఇలాంటి జైత్రయాత్రకి దారి చూపించింది మాత్రం ఖచ్చితంగా దర్శకధీరుడు రాజమౌళి.. రెబల్ స్టార్ ప్రభాస్ అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అయితే బాహుబలి ఇచ్చిన ఆ ఊపుతో ప్రభాస్ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు.

అసలు ఇప్పుడు బాలీవుడ్‌ సూపర్ స్టార్స్ అయిన షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌లకి దీటుగా ప్రభాస్‌కి అక్కడ స్టార్ డమ్ ఉంది. వాళ్ల సినిమాలను మించి ప్రభాస్ చిత్రాలకి ఓపెనింగ్స్ దక్కుతున్నాయంటే అక్కడ మన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు కల్కి సినిమా చూసిన నార్త్ ఆడియన్స్ మరోసారి బాలీవుడ్‌ను ఏకిపారేస్తున్నారు. సౌత్ ఇండియా నుంచి వస్తున్న చిత్రాలను చూసి బాలీవుడ్ ఇప్పటికైనా సిగ్గుపడాలంటూ తిడుతున్నారు. ఇక ఖాన్ త్రయం కాదు.. ప్రభాస్‌యే ఇండియాలో నెం.1 అని వాళ్లు చెబుతుంటే ప్రతి సౌత్ ఇండియన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ముంబై, పంజాబ్, దిల్లీ ఇలా ఎక్కడ చూసినా కల్కికి తిరుగేలేదు. ఇలానే తెలుగు సినిమా సౌత్ చిత్రాలు మరిన్ని అద్భుతమైన ప్రాజెక్టులను చేపట్టాలని ప్రతి ఒక్కరూ మనసారా కోరుకుంటున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-01T03:49:04Z dg43tfdfdgfd