NAGARKURNOOL | భారీవర్షానికి కూలిన మట్టిమిద్దె.. తల్లితోపాటు ముగ్గురు చిన్నారులు మృతి

నాగర్‌కర్నూలు: నాగర్‌కర్నూలు (Nagarkurnool) మండలంలోని వనపట్లలో విషాదం చోటుచేసుకున్నది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వనపట్లకు చెందిన గొడుగు భాస్కర్‌కు చెందిన ఇళ్లు కుప్పకూలింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న పద్మతోపాటు ఆమె ఇద్దరు కుమార్తెలు తేజస్విని (6) వసంత (9), కుమారుడు రిత్విక్‌ అక్కడికక్కడే మరణించారు. తండ్రి భాస్కర్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు భాస్కర్‌ను ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మట్టిపెళ్లలు తొలగించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ఇళ్లు కూలిన ప్రదేశాన్ని ఆర్డీవో, ఎమ్మార్వో పరిశీలించారు. వానాకాలం కావడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పాత ఇండ్లు ఉన్నవారు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కాగా, ఒకే కుటుంబంలో నలుగురు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 

2024-07-01T03:45:59Z dg43tfdfdgfd