OTT: ఓటీటీలో వస్తున్న ఈ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ తప్పకుండా చూడాల్సిందే...!

పొలిమేర సినిమాతో సత్యం రాజేష్ ఒక్కసారి హైప్ క్రియేట్ చేశాడు. కెరీర్ మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తు... ఇప్పుడు మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. పొలిమేర 2 తర్వాత... సత్యం రాజేశ్.. కీలక పాత్రలో నటించిన చిత్రం టెనెంట్. ఈ సినిమాను వై.యుగంధర్‌ తెరకెక్కించారు. ఎమ్‌.చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమాలో.... మేఘా చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చింది.ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు మరో ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది టెనెంట్ మూవీ. తెలుగు ఓటీటీ వేదిక అయినా ఆహా(Aha)లో జూన్‌ 28వ తేదీ నుంచి ‘టెనెంట్’ (tenant ott telugu) స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఈ సినిమాలో సమాజంలో మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసేలా తెరకెక్కించారు. అదే విధంగా.. బలమైన కథతో ఫ్యామిలీ ఎమోషన్‌ థ్రిల్లర్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గౌత‌మ్ (స‌త్యం రాజేష్‌) సంధ్య‌ను (మేఘా చౌద‌రి) వివాహం చేసుకుంటాడు. వీరిద్దరు.. హైద‌రాబాద్‌లో ఫ్యామిలీ పెడతారు. అయితే.. అన్యోన్యంగా.. చక్కగా సాగిపోతున్న వారి సంసారంలో... అనుకోకుండా విభేదాలు తలెత్తుతాయి. ఈ క్రమంలో ఒక రోజు సంధ్య‌ హ‌త్య‌కు గుర‌వుతుంది. అదేరోజు గౌత‌మ్ ప‌క్క ఫ్లాట్‌లో ఉండే రిషి (భ‌ర‌త్) కూడా బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నిస్తాడు. మరోవైపు రిషిని ప్రేమించిన వైష్ణ‌వి (చంద‌న‌) కూడా క‌నిపించ‌కుండా పోతుంది.

సంధ్య‌ను హ‌త్య చేసినందుకు పోలీసుల‌ను గౌత‌మ్‌ను అరెస్ట్ చేస్తారు. దీంతో ఇదంతా మిస్టరీగా మారుతుంది. మరి సంధ్య‌ను గౌత‌మ్ నిజంగానే హ‌త్య చేశాడా? రిషి, సంధ్య‌కు ఏమైనా సంబంధం ఉందా? హత్య, ఆత్మహత్య, మిస్సింగ్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? వీటి వెనుక గౌతమ్ పాత్ర ఉందా లేదా? ఈ కేసు వెన‌కున్న మిస్ట‌రీని ఏసీపీ (ఎస్తేర్) ఎలా ఛేదించారు? అనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. మరి సినిమా ఎలా ఉంది? తెలియాలంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా ఓటీటీలో చూసేయాల్సింది. ఈ సినిమాను ఇంతవరకు ఎవరైనా చూడకుండా ఉండే.. ఇక ఆహాలో కూడా చూసేయోచ్చు. అన్నది చిత్ర కథ.

2024-07-01T02:37:25Z dg43tfdfdgfd