ఈ మ్యాథ్స్ పజిల్‌లో మిస్ అయిన నంబర్ ఏదో తెలుసా..? బుర్రకు పదును పెట్టుకోండి..!

Maths Puzzle: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మిస్సింగ్ నంబర్ పజిల్స్ (Missing number puzzles) చాలామంది బుర్రలకు పని పెడుతున్నాయి. ఈ పజిల్స్ పరిష్కరించడం వల్ల మెదడు చురుకుగా మారుతుంది. ఈ పజిల్స్ అనేవి మ్యాథ్స్, లాజికల్ థింకింగ్ స్కిల్స్‌ను పరీక్షిస్తాయి. ఈ బ్రెయిన్ టీజర్స్‌లో ఒక గ్రిడ్ లేదా సీక్వెన్స్ ఉంటుంది, అందులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు ఉద్దేశపూర్వకంగా రిమూవ్ చేస్తారు. ఆ నంబర్‌ను కనిపెట్టడమే ఈ పజిల్ టాస్క్. ఈరోజు మీకోసం ఒక ఛాలెంజింగ్ మ్యాథ్స్ పజిల్ తీసుకొచ్చాం.

*మాథ్స్ పజిల్ లో మిస్సింగ్ నెంబర్..?

ఈ పజిల్ ఇమేజ్‌ను చెక్ చేయండి. ఇందులో వివిధ నంబర్లు ఉన్న ఒక గ్రిడ్ చూడవచ్చు. పై వరుసలో 2 3 4 5.. రెండో వరుసలో 4 6 8 10.. మూడో వరుసలో 6 9 12 15.. నాలుగో వరుసలో 36 144 360 ?? కనిపిస్తున్నాయి. ఆ మిస్సింగ్ (??) నంబర్‌ను 20 సెకన్లలో పరిష్కరించగలరా? ఈ మ్యాథ్స్ పజిల్ IQ, లాజికల్ థింకింగ్ పవర్ ను టెస్ట్ చేస్తుంది. పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే టైమర్ సెట్ చేసి సీక్వెన్స్ కనిపెట్టడానికి ప్రయత్నించాలి.

మిస్సింగ్ నంబర్ ఎంత..?

*టైం లిమిట్ లోనే కనుగొనాలి..

ఈ పజిల్‌కు ఆన్సర్ కనిపెట్టాలంటే విశ్లేషణాత్మక నైపుణ్యం ప్రదర్శించాలి. టైం లిమిట్ ఉంది కాబట్టి క్విక్‌గా థింక్ చేయాలి. గ్రిడ్‌లోని ప్రతి సంఖ్య ఒక నిర్దిష్ట నమూనా లేదా సీక్వెన్స్‌ను ఫాలో అవుతుందని గుర్తించి ఆ విధంగానే ఆలోచించాలి.

Diabetic Drinks: డయాబెటిస్ పేషెంట్లకు బెస్ట్ డ్రింక్స్.. ఇవి తాగితే రక్తంలో షుగర్‌ లెవల్స్ కంట్రోల్

* బుర్ర పెట్టి ఆలోచిస్తే ..

గ్రిడ్‌లోని సంఖ్యలను జాగ్రత్తగా పరిశీలించాలి. అడ్డు వరుసలు, నిలువు వరుసలలో ఏదైనా ప్యాట్రన్ లేదా సంబంధాలు ఉన్నాయో చూడాలి. గుర్తించిన ప్యాట్రన్ ఆధారంగా, ఏ సంఖ్య కనిపించకుండా ఉందో అంచనా వేయాలి. ఈ పజిల్‌ను ఇచ్చిన సమయంలో పరిష్కరించిన వారికి హై IQ ఉందని, ఒత్తిడిలో కూడా తెలివిగా ఆలోచిస్తూ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరని చెప్పవచ్చు. లాజికల్‌గా, అనలైటికల్‌గా ఆలోచించ గల శక్తి వీరి సొంతమని పరిగణించవచ్చు. తెలివైన బుర్ర ఉంటేనే వీటిని పరిష్కరించడం సాధ్యమవుతుంది. కొంచెం ప్రాక్టీస్ కూడా ఉండాలి. దీనిని కనిపెట్టలేని వారు కింద ఇచ్చిన సొల్యూషన్ చెక్ చేయవచ్చు.

*జవాబు ఎలా వచ్చిందంటే..

సమాధానం 720. ఈ ఆన్సర్ ఎందుకు వచ్చిందో వివరంగా తెలుసుకుందాం. గ్రిడ్‌లో ఇచ్చిన నిలువ వరుసలోని నంబర్స్ మల్టిప్లై చేయాలి. అలానే వాటిని ఎడిషన్ చేయాలి. మల్టిప్లైడ్‌ అమౌంట్ నుంచి కూడిక అమౌంట్‌ను తీసివేయాలి. ఆ విధంగా 4వ అడ్డు వరుసులో ఉన్న చివరి సంఖ్యను విధంగా లెక్కించవచ్చు. అదెలాగో కింద ఇచ్చాం.

(సంఖ్యల ఉత్పత్తి) - (సంఖ్యల మొత్తం)

(నిలువ వరుసలోని మొదటి సంఖ్య x రెండవ సంఖ్య x మూడవ సంఖ్య) - (మొదటి సంఖ్య + రెండవ సంఖ్య + మూడవ సంఖ్య) = నాలుగవ అడ్డు వరుసలోని నంబర్.

అలా చేస్తే 2 x 4 x 6 - 2 + 4 + 6 = 36,

3 x 6 x 9 - 3 + 6 + 9 = 144

4 x 8 x 12 - 4 + 8 + 12 = 360 వస్తుంది. అదే విధంగా, నాల్గవ వరుసలో కనిపించని సంఖ్యను కనుగొనడానికి మనం ఈ లాజిక్ అప్లై చేద్దాం. అప్పుడు 5 x 10 x 15 - 5 + 10 + 15 = 720 వస్తుంది.

2024-04-26T14:22:11Z dg43tfdfdgfd