చిరు, పవన్ మధ్య చిన్న గ్యాప్.. ఆ టైంలో చరణ్ పరిస్థితి ఏంటి, ఎలా డీల్ చేశాడో తెలుసా

గ్లోబల్ స్టార్ గా ఖ్యాతి దక్కించుకున్న రాంచరణ్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీ అవుతున్నాడు. నేడు రాంచరణ్ 39వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిరుత చిత్రంతో చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

గ్లోబల్ స్టార్ గా ఖ్యాతి దక్కించుకున్న రాంచరణ్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీ అవుతున్నాడు. నేడు రాంచరణ్ 39వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిరుత చిత్రంతో చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఎంత కాదన్నా నెపోటిజం అనే ముద్ర చరణ్ పై కూడా ఉంది. 

కానీ ఈ స్టార్ డమ్ కి తాను అర్హుడినే అని రాంచరణ్ ప్రతి సందర్భంలో ప్రూవ్ చేస్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగాడు. నేడు చరణ్ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు, ఫ్యామిలీ వ్యవహారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ప్రజారాజ్యం పార్టీ విలీనం అయినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించే వరకు మెగా బ్రదర్స్ మధ్య కాస్త గ్యాప్.. ఐడియాలజీకి సంబంధించిన విభేదాలు వచ్చినట్లు అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. ముందుగా మెగా ఫ్యామిలీ ఆ వార్తలని ఖండించినప్పటికీ.. పవన్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత కాస్త క్లారిటీ వచ్చింది. 

తండ్రి లాంటి అన్నయ్యతో విభేదించినప్పటికీ ఆయన తాను ఎదురెళ్లనని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. కానీ జనసేన పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవి కాస్త హర్ట్ అయ్యారట. అదే సమయంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ హఠావో అంటూ పవన్ పిలుపు ఇవ్వడం సంచలనంగా మారింది. ఆ టైంలో మెగా ఫ్యామిలీ గురించి మీడియాలో ఇంకా వార్తలు ఎక్కువయ్యాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య విభేదాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 

ఆ టైంలో రాంచరణ్ చాలా మెచ్యూరిటీ ప్రదర్శించారు. ఓ ఇంటర్వ్యూలో ఆ సిచ్యువేషన్ ని ఎలా ఎదుర్కొన్నారు అని ప్రశ్నించగా చరణ్ ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. ఆ టైంలో కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంది అని కూడా అడిగారు. చరణ్ బదులిస్తూ.. ఈ మొత్తం సినారియోలో నాన్నగారిని, బాబాయ్ ఇద్దరినీ అభినందించాలి. ఎందుకంటే ప్రజా సేవ అనేదే ఇద్దరి ధ్యేయం. కాకపోతే ఐడియాలజీ వేరు. 

వ్యక్తులుగా ప్రతి ఒక్కరికి సొంత ఆలోచనలు ఉంటాయి. అదే విధంగా వాళ్లిద్దరూ వేరు వేరు పార్టీలో ఉన్నారు. అంతమాత్రాన ఏదో జరిగిపోయింది అని అంటున్నారు. అన్నదమ్ములుగా, పర్సనల్ గా బాబాయ్, నాన్న మధ్య చిన్న పొరపొచ్చాలు కూడా లేవు. వాళ్లిద్దరూ బ్లడ్ బ్రదర్స్ అని చరణ్ బదులిచ్చాడు. అన్నదమ్ములుగా వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా జరిగితే అది వాళ్ళిద్దరి మధ్యే ఉంటుంది. మా దాకా రాదు. మూడో వ్యక్తికి అవకాశం లేదు అంటూ రాంచరణ్ ఆ సమయంలో చాలా హుందాగా సమాధానం ఇచ్చారు. 

ఇప్పుడు చిరంజీవి రాజకీయాలకు దూరం అయ్యారు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు రాంచరణ్ పాన్ ఇండియా స్టార్ గా వరుస చిత్రాలు చేస్తున్నారు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రాంచరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. 

2024-03-27T10:26:27Z dg43tfdfdgfd