టెన్త్ బయోలజీ క్వశ్చన్ పేపర్​లో పొరపాట్లు!

టెన్త్ బయోలజీ క్వశ్చన్ పేపర్​లో పొరపాట్లు!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గురువారం జరిగిన టెన్త్ బయోలజీ క్వశ్చన్ పేపర్ విద్యార్థులను కొంత గందరగోళానికి గురిచేసింది. బ్లూప్రింట్​కు విరుద్ధంగా ఒక క్వశ్చన్ ఇవ్వగా, ఇంగ్లిష్ మీడియం క్వశ్చన్ పేపర్​లో ని ఒక క్వశ్చన్  లో తప్పు వచ్చిందని విద్యార్థులు, టీచర్లు చెప్తున్నారు. రెండో విభాగంలో నాలుగు మార్కులకు చెందిన ఐదో క్వశ్చన్  తెలుగు మీడియంలో ప్రశ్న సరిగానే ఇవ్వగా, ఇంగ్లిష్ మీడియంలో మాత్రం తప్పుగా ఇచ్చారు.

మీ దైనందిన జీవితంలో పరిశీలించిన ఏవేని రెండు కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాలను ఉదాహారణలతో వివరించండి అని తెలుగులో ఇవ్వగా, ఇంగ్లిష్  లో కీలకమైన ‘వెజిటేటివ్ ’ పదం లేకుండా క్వశ్చన్ ఇచ్చారు. దీంతో స్టూడెంట్లు అయోమయానికి గురయ్యారు. 

బ్లూప్రింట్ అమలు చేయలే

మరోపక్క క్వశ్చన్ పేపర్ బ్లూప్రింట్ ప్రకారం.. సమాచారంతో ఒక క్వశ్చన్ ఇచ్చి దాంట్లోంచి క్వశ్చన్లు అడగాల్సి ఉందని టీచర్లు చెప్తున్నారు. దీనికి విరుద్ధంగా ఆరో క్వశ్చన్  లో బొమ్మలు ఇచ్చి, ప్రశ్నలు అడగటంతో  స్టూడెంట్లు ఇబ్బందులు పడ్డారని పేర్కొంటున్నారు.  గతంలో ఎప్పుడూ టేబుల్స్ ఇచ్చి.. దాంట్లోంచి క్వశ్చన్లు అడిగేవారని గుర్తుచేశారు. దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించి, స్టూడెంట్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

సమస్యపై  ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావును ‘వెలుగు’ వివరణ కోరగా... ఏప్రిల్ ఒకటో తారీఖున అన్ని సబ్జెక్టు ఎక్స్ పర్ట్స్ తో క్వశ్చన్ పేపర్లపై సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.  తప్పులు వచ్చినట్టు తేలితే మార్కులు కలుపుతామన్నారు. బయోలజీ క్వశ్చన్ పేపర్ నిబంధనల ప్రకారమే ఇచ్చినట్టు  పేర్కొన్నారు. కాగా, బయోలజీ పరీక్షకు 1405 మంది రెగ్యులర్,937 మంది ప్రైవేటు విద్యార్థులు అటెండ్ కాలేదని ఆయన  ఒక ప్రకటనలో తెలిపారు. నలుగురు సిబ్బందిని విధుల నుంచి తప్పించామని, ఒక స్టూడెంట్ పై మాల్  ప్రాక్టీస్ కేసు నమోదయిందని పేర్కొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-03-29T01:58:13Z dg43tfdfdgfd