దేవుడి పేరు రాస్తే పరీక్షలో పాస్ చేశారు.. ఇదేం ఖర్మరా బాబు..!

విద్యార్థులు పరీక్షల్లో సినిమా స్టోరీలు రాయడం ఇప్పటిదాకా చూశాం కానీ.. ఓ విద్యార్థి కాస్త డిఫరెంట్ గా ఆలోచించి దేవుడి పేరు రాసి పరీక్ష పాస్ అయ్యాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. యూపీ యూనివర్సిటీలో D- ఫార్మసీ మొదటి సంవత్సరం పరీక్షలు జరగగా.. ఈ పరీక్షల్లో కొందరు వ్యక్తులు జవాబు పత్రాల్లో జై శ్రీరామ్‌ నినాదాలతో పాటు, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి క్రికెటర్ల పేర్లను రాశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అలా రాసిన సదరు విద్యార్థులు 60 శాతం మార్కులతో పాస్ కావడం.

యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో.. విద్యార్థి నాయకుడు దివ్యాంశు సింగ్ ప్రధాని, ముఖ్యమంత్రి, గవర్నర్, వైస్ ఛాన్సలర్‌లకు లేఖ రాశారు. కొందరు ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది కుమ్మక్కై సున్నా మార్కులు రావాల్సిన విద్యార్థులను కూడా ఫస్ట్ క్లాస్‌లో పాస్ చేశారని ఆరోపించాడు. అంతేకాదు RTI చట్టం క్రింద జవాబు పత్రాలను పరిశీలన చేయాలని కోరాడు. దీంతో అసలు భాగోతం బయటపడింది.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 506 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

దీనిపై యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ వందనా సింగ్ రియాక్ట్ అవుతూ.. విద్యార్థులు అక్రమ మార్గంలో ఉత్తీర్ణత సాధించారన్న విషయం తమ దృష్టికి రాగానే దీనిపై ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించామని, ఆ కమిటీ నివేదికలో విద్యార్థులకు ఎక్కువ మార్కులు కేటాయించినట్లు తేలిందని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిణామాలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే జై శ్రీరామ్‌ లాంటి దేవుడి నినాదాలు రాసి పరీక్షలు పాస్ కావడం జనాల్లో హాట్ టాపిక్ అయింది.

2024-04-27T06:39:46Z dg43tfdfdgfd