థాంక్యూ సమంత గారు : అనుపమ

డీజే టిల్లు తరువాత అనుపమ కెరీర్ ఏంటా? అని అంతా ఆలోచించేశారు. ఎలాంటి పాత్రలు ఎంచుకుంటుంది? ఇక ఎలాంటి సినిమాలు తీస్తుందని అంతా అనుకున్నారు. పూర్తిగా రొమాంటిక్ పాత్రల్లోనే కనిపిస్తుందా? కమర్షియల్ హీరోయిన్‌గానే ఉంటుందా? అని అనుకున్నారు. కానీ అనుపమ మాత్రం మంచి కథలు, తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండే రోల్స్ మాత్రమే పోషిస్తానని చెప్పుకొచ్చింది. తన మనసుకు దగ్గరయ్యే పాత్రలను మాత్రమే చేస్తానని అనేసింది. దీనికి తగ్గట్టుగానే అనుపమ తన కొత్త మూవీ అప్డేట్ వచ్చింది.

అనుపమ పరదా అంటూ రాబోతోంది. ఇదేదో రెగ్యులర్ కమర్షియల్ మూవీలా అనిపించడం లేదు. ఇది లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లా కనిపిస్తోంది. ఇక ఇందులో అనుపమ, దర్శన, సంగీతలు ప్రముఖ పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్, గ్లింప్స్ బాగానే ఆకట్టుకుంటున్నాయి. రాజ్ అండ్ డీకే, సమంత కలిసి వదిలిన ఈ అప్డేట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

డీజే టిల్లు తరువాత నేను కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాలే చేస్తానని చెప్పాను.. నేను చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకుంటున్నాను.. పరదా సినిమా కథ అందరినీ ఆకట్టుకుంటుంది అని అనుపమ చెప్పుకొచ్చింది. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌ను సమంత తన ఇన్ స్టా స్టోరీలో పెట్టి సినిమా టీంను ప్రశంసించింది.

పరదా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉండబోతోందని అర్థం అవుతోంది.. ఎంతో థ్రిల్లింగ్,ఎగ్జైటింగ్‌గా ఉంది.. ఈ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది.. అనుపమ, దర్శన, సంగీతలకు ఆల్ ది బెస్ట్ అంటూ సమంత పోస్ట్ వేసింది. ఈ మేరకు అనుపమ తన స్టోరీలో సమంతకు రిప్లై ఇచ్చింది. థాంక్యూ సమంత గారు అని తన ఇన్ స్టా స్టోరీలో అనుపమ పెట్టేసింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-26T15:02:40Z dg43tfdfdgfd