GOOD FRIDAY: చిరుధాన్యాలతో ఏసు ప్రభువు చిత్రం... గుడ్ ఫ్రైడే సందర్భంగా చిత్రీకరణ

గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైన పండగ. ఈ పండగ వాళ్లు ఎంతో గొప్పగా జరుపుకుంటారు ఆ గుడ్ ఫ్రైడే రోజు ప్రభువు అందించిన సందేశాన్ని తలుచుకుంటూ వాళ్ళందరూ భక్తితో ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ రోజు వాళ్లకు ఎంతో పవిత్ర దినం. అలాగే క్రైస్తవ సమాజానికి ఇది ఎంతో మంచి రోజుగా చెప్తారు.
గుడ్ ఫ్రైడేను ఏసు క్రీస్తుకు శిలువ వేసిన రోజు. ఆ రోజున క్రీస్తును తలుచుకుంటూ ఆయన అందించిన సందేశాన్ని చర్చిలో ఫాదర్ ద్వారా వింటూ బైబిల్‌ని మనస్ఫూర్తిగా చదువుకోవడం ప్రతి క్రైస్తవుడు చేసే పని. ఏసుక్రీస్తు అందించిన శాంతి సందేశాన్ని పలుమార్లు వింటారు. అలాగే ఏసుక్రీస్తు శరీరాన్ని ఆయన రక్తాన్ని రొట్టె, ద్రాక్షరసంగా స్వీకరిస్తారు.గుడ్ ఫ్రైడేను ఏసు క్రీస్తుకు శిలు వేసిన రోజు. ఆ రోజున క్రీస్తును తలుచుకుంటూ ఆయన అందించిన సందేశాన్ని చర్చిలో ఫాదర్ ద్వారా వింటూ బైబిల్ ని మనస్ఫూర్తిగా చదువుకోవడం ప్రతి క్రైస్తవుడు చేసే పని. ఏసుక్రీస్తు అందించిన శాంతి సందేశాన్ని పలుమార్లు వింటారు. అలాగే ఏసుక్రీస్తు శరీరాన్ని ఆయన రక్తాన్ని రొట్టె, ద్రాక్షరసంగా స్వీకరిస్తారు.
క్రైస్తవులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు మూడు. లోకరక్షకుడు పుట్టిన రోజు క్రిస్మస్, శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే, సమాధి నుంచి తిరిగి పునరుత్థానుడిగా వచ్చిన రోజు ఈస్టర్. ఈ మూడు పండుగలు క్రైస్తవుల జీవితాల్లో చాలా ముఖ్యమైనవి చెప్పాలి. చర్చిలకు ఎక్కువ మంది క్రైస్తవులు వెళ్లి ఈ పండగల్లో ప్రార్థనలు చేస్తారు. అలాగే ఎప్పుడూ మంచి బాటలోనే నడిపించమని క్రైస్తవులు వేడుకుంటారు.
ఈ గుడ్ ఫ్రైడే ను పురస్కరించుకొని ప్రముఖ చిత్రకారుడు.. ముఖ్యంగా చిరుధాన్యాలతో చిత్రాలను చేసే మోకా విజయ్ కుమార్ చిరుధాన్యాలతో ఒక చిత్రాన్ని చక్కగా చేశారు. శిలువకు ముందు క్రీస్తు శాంతి సందేశం అందించిన ఆ చిత్రాన్ని ఆయన గీశారు. ఆ చిత్రంలో చిరుధాన్యాలు ఎక్కువగా వాడారు. ప్రశాంత చిత్తంతో ఉన్న ఏసుక్రీస్తు చిత్రం మనకి ఇందులో కనిపిస్తుంది.
రాగులు, అరకలు, సామలు, సజ్జలు వంటి చిరుధాన్యాలను ఇందులో వాడారు. అలాగే ప్రకృతి సిద్ధంగా వచ్చే కొన్ని రంగుల్ని ఇందులో వాడి చిరుధాన్యాలతో అలంకరించి ఈ విధంగా తీర్చిదిద్దారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు అందించిన సందేశం అందరూ తలుచుకోవాలని ఆయన సందర్భంగా కోరారు.
గుడ్ ఫ్రైడే ముందు రోజు గురువారం నాడు క్రీస్తుని క్రైస్తవులు అందరూ కూడా తలుచుకుంటూ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ క్రమంలో ఆయన కూడా క్రీస్తు చిత్రపటాన్ని ఇలా చిరుధాన్యాలతో చిత్రీకరించి ఆ తర్వాత క్రీస్తు చెప్పిన సందేశాన్ని తలుచుకున్నారు. అలాగే ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవ సమాజం కూడా క్రీస్తు బోధనల్ని అలాగే ఏసు సందేశాన్ని వినాలని అలాగే క్రీస్తుకు సంబంధించిన అన్ని అంశాలని శాంతి సందేశాన్ని ప్రజలకి వినిపించి.. శాంతి బాటని అలవర్చుకోవాలని చెప్పారు.

2024-03-29T04:45:57Z dg43tfdfdgfd