VIJAY ANTONY | ఎవరి గతంలో లేని హీరో.. మరొకరి భవితగా ఎలా మారాడు?

Vijay Antony | విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తుఫాన్‌’. విజయ్‌ మిల్టన్‌ దర్శకుడు. పొయెటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. జూలైలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఎవరి గతంలో లేని హీరో, మరొకరి భవితగా ఎలా మారాడనే ఆసక్తికరమైన అంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ట్రైలర్‌ ద్వారా తెలియజేశారు.

అజ్ఞాతవాసంలో ఉన్న హీరోను ఓ కుటుంబం ఆదరిస్తుంది. మరోవైపు ఓ పోలీస్‌ అధికారి అతని కోసం గాలిస్తుంటాడు. తనను ఆదరించిన ఫ్యామిలీ కోసం హీరో ఏం చేశాడు? పోలీసులు అతన్ని వెంటాడటానికి కారణాలేమిటి? అసలు అతని తాలూకు గతం ఏమిటి? అనే అంశాలతో ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిని పెంచింది.

విజయ్‌ ఆంటోని గత చిత్రాల తరహాలోనే ఇదొక విభిన్నమైన కథాంశమని దర్శకుడు తెలిపారు. శరత్‌కుమార్‌, మేఘా ఆకాష్‌, మురళీశర్మ, పృథ్వీ అంబర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి, విజయ్‌ ఆంటోని, రచన-సినిమాటోగ్రఫీ-దర్శకత్వం: విజయ్‌ మిల్టన్‌.

2024-06-30T22:45:06Z dg43tfdfdgfd