ఈ మేదరుల పరిస్థితిని పట్టించుకునే వారే లేరా..?

పెళ్లిళ్లు, శుభకార్యాలలో వెదురు బొంగుల‌తో త‌యారు చేసే మేదరి బుట్టలు, చాట‌లు అవసరం అవుతాయి. అయితే మారుతున్న కాలంతో పాటు మేదరి బుట్టలకు బదులు ప్లాస్టిక్ బుట్టలు వచ్చాయి. దీంతో మేదరులకు ఉపాధి కరువైంది. కుల వృత్తులను ప్రొత్సహించే ప్రభుత్వం మాకు ఆర్థిక సహాయం అందించి అదుకోవాలని మేదరులు కోరుతున్నారు.

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మేదరి కార్మికులు కుల వృత్తిని న‌మ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరి జీవనాధారమైన బుట్టల అల్లికలు, వాటిని మార్కెట్ లో పెట్టుకుని అమ్ముకుంటారు. అయితే గ‌తంతో పోర్చితే ఇప్పుడు మేదరి బుట్టలకు డిమాండ్ త‌గ్గి పోయింది. దీంతో రోజు కూలీ కూడా ప‌డ‌డం లేద‌ని వాపోతున్నారు. అయితే పెళ్లిళ్లు శుభకార్యాలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున వ్యాపారం జరిగేది. కానీ రాను రాను ప్లాస్టిక్ బుట్టలు ప్లాస్టిక్ చాటలు రావడంతో తమ ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

---- Polls module would be displayed here ----

కనీసం తమశ్రమకు తగిన కూలీ కూడా దొరికే పరిస్థితి లేదు. బుట్టలు తయారు చేయడానికి వాడే బొంగు సైతం 200 రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు బుట్ట తయారు చేయడానికి పట్టే శ్రమకు, బుట్ట అమ్మితే వచ్చే డబ్బులకు కనీసం గిట్టుబాటు కూడా రావడం లేదనిమేదరి సాయిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కుల వృత్తులను ప్రొత్సహిస్తుంది. తమకు సోసైటీలు ఉండేవి తక్కువ ధరలో బొంగు దొరికేది.

ఈ రోజు సోసైటీలు లేవు. బోందు దోరకడం లేదు. వెదురు బొంగులను పేపర్ మిల్లులకు ఇస్తున్నారు. తమకు ఉపాధి లేకుండా పోయింది. తమని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం మేదర వృత్తిని బతికించాలని, మేదర్ల జీవనమైన మేదరి బుట్టలు అల్లికలకు కావాల్సిన వెదురు బొంగులను తక్కువ ధరకు అందించాలని కోరుతున్నారు.

2024-07-01T07:53:26Z dg43tfdfdgfd