పెళ్లి కానీ ఆడపిల్లలు.. ఈ తీజ్ పండగ ఎందుకు చేస్తారో తెలుసా..

తెలంగాణ లోని ఆడపడుచులు 9 రోజుల పాటు ఆడి పాడి జరుపుకునే అతి పెద్ద పండుగ దసరా. ఇన్ని రోజులు జరుపుకునే ఒకే పండుగ అని అనుకుంటాము కానీ సుమారు 9 రోజుల పాటు జరుపుకునే మరొక పండగ తీజ్ పండుగ.. ఈ పండగ గురించి చాలా మందికి తెలియదు. ఈ పండుగ గిరిజనులకు మాత్రమే సొంతం. కేవలం గిరిజనులు మాత్రమే వారి సంప్రదాయాల్లో సుమారు తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను అతి పెద్ద పండుగగా, ఆట పాటలతో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.

అంతటి ప్రత్యేకతలు ఉన్న ఈ పండుగ విశేషాలు ప్రత్యేకతలపై లోకల్18 ప్రత్యేక కథనం.తీజ్ పండుగ గిరిజనుల్లో తరాలుగా సంప్రదాయంగా వస్తున్న పండుగ కాగా.ఈ పండుగ లంబాడీ,గిరిజనులు మాత్రమే ప్రత్యేకంగా జరుపుకునే పండుగ.ఇందులోనే భాగంగా కరీంనగర్ లో శతవాహన యూనివర్సిటీ లో ఈ పండగను నిర్వహించారు..ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే పెళ్లి ఈడు వచ్చిన యువతులు తమకు మంచి వరుడు దొరకాలని ఊర్లో ఒక దగ్గర ఒక చిన్నగా పందిరి నిర్మాణం చేసి అక్కడ కొంచెం మట్టి తెచ్చి బుట్టలలో నవధాన్యాలను పోస్తారు.ఈ నవధాన్యాలను తొమ్మిది రోజుల పాటు ప్రతి రోజూ మూడు సార్లు ఇత్తడి బిందెతో నీరు పోస్తూ పూజిస్తారు.

ప్రతి రోజూ వారి సంప్రదాయాల్లో ఆటలు పాటలు పాడుతుంటారు. తీజ్ పండుగను సేవా భాయ్ దండియాడి అనే దేవత జరిపిస్తుందని గిరిజనులు విశ్వసిస్తారు. అందుకే ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు గిరిజనులు. ఈ పండుగ గిజనుల కుటుంబాల్లో ప్రతి రోజూ ప్రత్యేకతను సంచరించుకుంటుందీ. ముఖ్యంగా ఇందులో 7వ రోజు డమోలి అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి ఇంట్లో బియ్యంతో చేసిన పిండితో రొట్టెలు చేస్తారు. బెల్లం కలిపి ముద్దలు చేస్తారు. తీజ్ బట్టలు ఉన్న అవరణలో సేవాభాయి, మెరమల పూజలు నిర్వహిస్తారు.9 రోజులు పూజించిన తరువాత నిమజ్జన వేడుకలు సంప్రదాయంగా ఘనంగా నిర్వహించుకుంటారు.

పెళ్లి కాని యువతులు ఉదయం ఇంటి ఇంటికి వెళ్లి ఉయ్యాల ఆట ఆడుతారు. రెండు బొమ్మలను ఉయ్యాలలో పెట్టి ఊపుతూ ఆటలు, పాటలతో సందడి చేస్తారు. ఇక నవ ధాన్యాలు బుట్టల వద్ద ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అనంతరం నిమజ్జనం వేడుక కన్నుల పండుగ జరుపుకుంటారు. ఊరంతా డీజే బాక్సులతో, డప్పు చప్పుళ్లతో ఆటపాటలతో అడుతు డాన్సులు చేస్తూ ఘనంగా నిర్వహించుకుని ఆ ప్రాంతంలో నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇది గిరిజన కుటుంబాల్లో అనాదిగా వస్తున్న సంప్రదాయంని గిరిజన పెద్దలు లోకల్ 18కి తెలిపారు..

2024-07-01T15:39:23Z dg43tfdfdgfd