శర్వానంద్‌కి ఈ సీరియల్ నటుడు డబ్బింగ్ చెప్పేవాడా?

కొంత మంది హీరోలు తమ కెరీర్ ప్రారంభంలో సొంత గొంతుని వాడరు. నితిన్, రోహిత్, శర్వానంద్ వంటి వారి కెరీర్ ప్రారంభంలో వేరే ఇతర వ్యక్తులు డబ్బింగ్ చెప్పారన్న సంగతి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. నితిన్ చిత్రాలకు అప్పట్లో హీరో శివాజీ డబ్బింగ్ చెప్పేవాడు. శర్వానంద్ కెరీర్ ప్రారంభంలో ఓ రెండు చిత్రాలకు సీరియల్ నటుడు కౌశిక్ డబ్బింగ్ చెప్పాడట. కౌశిక్ అంటే బుల్లితెరపై ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఆయన హీరోగా చేసిన ఎన్నో సీరియల్స్ బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి.

బుల్లితెరపై సీరియల్ నటుడు కౌశిక్ ఈటీవీ, జెమిని, స్టార్ మా, జీ తెలుగు ఇలా అన్ని చానెళ్లలో కనిపిస్తుంటాడు. ఆయన ఎన్నో సీరియల్స్‌లో కనిపించాడు. బాలాదిత్యకు అన్న అయిన కౌశిక్‌కు బుల్లితెరపై మంచి క్రేజ్ ఏర్పడింది. వెండితెరపైనా అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తుంటాడు. చిరంజీవి స్టాలిన్ చిత్రంలోనూ ఓ కారెక్టర్‌లో కనిపిస్తాడు.

కౌశిక్ మాట్లాడుతూ.. చిరంజీవితో స్టాలిన్‌లో పని చేయడం గురించి చెబుతూ.. నాటి రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు. ఈటీవీలో తాను చేసే ప్రోగ్రాంను చిరంజీవి ఫాలో అయ్యేవాడట. స్టాలిన్‌కు తనను ఆడిషన్ చేయకుండానే సెలెక్ట్ చేశారని చెప్పుకొచ్చాడు. చిరంజీవి తన కో ఆర్టిస్టులకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వరని, సొంత బాడీ లాంగ్వేజ్‌తోనే నటించమని ప్రోత్సహిస్తుంటాడట. ఆ క్వాలిటీని తాను నేర్చుకున్నానని కౌశిక్ చెప్పుకొచ్చాడు.

ఇక ఇలా నటించడం మాత్రమే కాకుండా డబ్బింగ్ కూడా చెబుతానని, హీరో రోహిత్, శర్వానంద్‌లకు డబ్బింగ్ కూడా చెప్పానని తెలిపాడు. శర్వానంద్ ఐదో తారీఖు, వీధి చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పానని, గమ్యం నుంచి శర్వానంద్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం స్టార్ట్ చేశాడని తెలిపాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-01T15:35:59Z dg43tfdfdgfd