అలాంటి సీన్స్ చేయలేక ఎన్నో సినిమాలను వదులుకున్నా.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..
ఇక సీతా రామం సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్‌కు టాలీవుడ్లో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సినిమా విజయం తర్వాత ఈ భామకు ఇప్పటికే నాని 30 హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్గా చేసింది. ఈ సినిమాతో పాటు తాజాగా విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్లా సినిమాలో హీరోయిన్గా చేసింది. Photo : Instagram అది అలా ఉంటే.. కెరీర్ ఆరంభంలో మాత్రం చిన్న ముద్దు సీన్ అన్నా కూడా భయపడిపోయేదట మృణాల్. కేవలం కిస్, ఇంటిమేట్ సీన్లు ఉన్నాయని ఎన్నో మంచి సినిమాలు కూడా వదులుకున్నానని అంటోంది మృణాల్. ఏదైనా కథ చెప్పినపుడు ముద్దు సీన్లు ఉన్నాయని అనగానే తనకు తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చేవారట. దీంతో చాలా సినిమాలకు నో చెప్పేసేదాన్నని మృణాల్ పేర్కోంది. అయితే పేరెంట్స్‌తో డిస్కస్ చేశాకా.. అలాంటీ సీన్స్ ఉన్నా.. ప్రస్తుతం చేస్తున్నాంటూ తెలిపింది. ఇక ఈ భామ నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న విషయానికి వ్తే.. ఈ సినిమా 2023 డిసెంబర్ 07న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సీతారామం సినిమాతో మంచి ఫామ్‌లోకి వచ్చిన మృణాల్.. తెలుగులో వరుస సినిమాలతో కేక పెట్టిస్తోంది. అందులో భాగంగా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిందట. ఇక హాయ్ నాన్నసినిమా కోసం ఆమె దాదాపుగా 3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట. Photo : Instagram ఇక వరుస సినిమాలతో మంచి ఫామ్‌లో మృణాల్‌కు ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భామ తమిళ్లో హీరో శివ కార్తికేయన్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ నడుస్తోంది. డాన్, డాక్టర్ సహా తదితర చిత్రాల హిట్లతో అదరగొట్టిన శివ కార్తికేయన్, దర్శకుడు మురగదాస్‌తో ఓ పాన్ ఇండియా సినిమా చేసేందుకు రెడీ అయ్యారట. ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారట. Photo : Instagram ఇక మృణాల్ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, పరశురామ్ మూవీలో మృణాల్ హీరోయిన్గా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు తెలుగులో హాయ్ నాన్నతో పాటు సీతారామం సినిమాలోను నటించింది. Photo : Instagram సీతా రామం విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్‌గా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీ దత్ నిర్మించిన లేటెస్ట్ సినిమా సీతారామం. ప్యాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్, సుమంత్ కీలకపాత్రలో నటించారు. 2022ఆగస్టు 5న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. Photo : Instagram ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ ఠాగూర్ నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో రష్మిక మందన్న చేసింది. ఇక ఈ సినిమాతో సుమంత్.. లెఫ్ట్‌నెంట్ కల్నల్ విష్ణు శర్మ పాత్రలో కనిపించనున్నారు. ఈయన భార్యగా భూమిక నటిస్తోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సైనికుడి పాత్రలో ఆకట్టుకున్నారు. కశ్మీర్ విజువల్స్, ఫోటోగ్రఫీ బాగున్నాయి. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత అందంగా మార్చేశాయి. Photo : Instagram ఇక మృణాల్ పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె 1 ఆగస్టు 1992న మహారాష్ట్రలోని ధూలేలో జన్మించారు. మృణాల్ ముంబైలోని KC కాలేజీ నుండి మాస్ మీడియా చదివారు. మృణాల్ ఠాకూర్ జీ టీవీ సోప్ ఒపెరా కుంకుమ్ భాగ్యలో నటించి మరింత పాపులర్ అయ్యారు. ఇక ఆమె సినీ కెరీర్ విషయానికి వస్తే.. మృణాల్ ఠాకూర్ 2014లో విడుదలైన మరాఠీ చిత్రం, విట్టి దండుతో సినీ రంగ ప్రవేశం చేశారు. 2012లో, ఠాకూర్ అంతర్జాతీయ చిత్రం లవ్ సోనియాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి మెప్పించారు. ఇక హిందీలో ఆమె 2019లో వికాస్ బహ్ల్ బయోపిక్ సూపర్ 30 నటించి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. Photo : Instagram ఇక 2020లో ఠాకూర్ నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్‌లో మంచి పాత్రలో మెరిశారు. అదే సంవత్సరం జాన్ అబ్రహంతో కలిసి 'గల్లన్ గోరియా' అనే మ్యూజిక్ వీడియోలో కనిపించారు. 2021లో ఠాకూర్ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన తూఫాన్ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించారు. ఇక ఠాకూర్ నటించిన సినిమా జెర్సీ. ఈ సినిమా 2019 తెలుగు చిత్రం జెర్సీ రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమాలో ఆమె షాహిద్ కపూర్‌తో కలిసి నటించారు. ఈ సినిమా 22 ఏప్రిల్ 2022న విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది. Photo : Instagram
2024-05-04T12:26:34Z
ఈ తేదీల్లో జన్మించిన వారికి సాక్ష్యాత్తు లక్ష్మీదేవి కటాక్షం.. బై బర్త్ వీరు మహారాజులే!
జ్యోతిష్యశాస్త్రం మాదిరిగానే సంఖ్యా శాస్త్రం కూడా ప్రజల జీవితంపై ప్రభావం చూపుతుందని చాలామంది నమ్ముతారు. సంఖ్యాశాస్త్రం (Numerology) అనేది వ్యక్తుల జీవితాలపై సంఖ్యలు చూపించే ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. పుట్టిన తేదీ ఆధారంగా ఒక వ్యక్తి లక్షణాలు, సామర్థ్యాలు, ధోరణుల గురించి సమాచారాన్ని అందిస్తుంది. న్యూమరాలజీ ఆరోగ్యం, సంపద గురించి కూడా చాలా విషయాలను తెలియజేస్తుంది. న్యూమరాలజిస్టుల ప్రకారం, నిర్దిష్ట తేదీల్లో పుట్టిన కొంతమంది వ్యక్తులు సంపదను ఆకర్షించే లక్షణాలతో జన్మిస్తారు. ఆర్థిక విషయాల్లో మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలరు. నెలతో సంబంధం లేకుండా ఈ తేదీల్లో జన్మించిన వారు డబ్బు బాగా సంపాదిస్తారు. మరి సహజంగా సంపద, విజయాన్ని ఆకర్షించే సామర్థ్యం ఉన్న ఆ వ్యక్తులు వారెవరో చూద్దాం. 13వ తేదీన జన్మించిన వ్యక్తులువీరికి అద్భుతమైన ఆర్థిక విశ్లేషణ నైపుణ్యాలు ఉంటాయి. 13వ సంఖ్య ఇండిపెండెంట్ నంబర్ 1, ప్రాక్టికల్ నంబర్ 3 లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కలయిక కారణంగా వీరు ఆర్థిక అంశాలను చక్కగా విశ్లేషించగలరు, సరైన నిర్ణయాలు తీసుకోగలరు. 4వ తేదీ4వ తేదీన జన్మించిన వ్యక్తులు తరచుగా ఆర్థిక తెలివితేటలను ప్రదర్శిస్తారు. 4వ సంఖ్య వాస్తవికత, కష్టపడి పనిచేయడం, సున్నితమైన ప్రణాళికతో సంబంధం కలిగి ఉంటుంది. వీరు బడ్జెటింగ్, సేవింగ్, డబ్బును సమర్థవంతంగా నిర్వహించడంలో రాణిస్తారు. ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి కచ్చితమైన ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తారు. డబ్బు విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. 8వ తేదీఈ తేదీన జన్మించిన వ్యక్తులు సహజంగా సంపద వైపు ఆకర్షితులవుతారు. 8వ సంఖ్య సంపద, విజయం, ఆర్థిక నైపుణ్యంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ వ్యక్తులకు డబ్బు గురించి మంచి అవగాహన ఉంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక విజయం సాధించడానికి వనరులను ఎలా ఉపయోగించాలో వీరికి బాగా తెలుసు. 17వ తేదీనెలలో 17వ తేదీన పుట్టినవారు ఆర్థిక విషయాల్లో వ్యూహాత్మకంగా ఆలోచిస్తారు. 17వ సంఖ్య లోతైన ఆలోచన కలిగిన 7వ సంఖ్య.. జ్ఞానానికి సంపదకు సంబంధించిన 8వ సంఖ్య శక్తిని కలిగి ఉంటుంది. ఈ కలయిక వీరికి దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాలను రూపొందించడం, వారి ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)
2024-05-04T04:54:59Z