ప్రభాస్‌ రిజెక్ట్ చేసిన ఐదు బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు ఏంటో తెలుసా? ఆ మూవీస్‌ చేసి స్టార్స్ అయ్యింది వీళ్లే!

ప్రభాస్‌ కెరీర్‌లో హిట్ల కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆయన మంచి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను రిజెక్ట్ చేశారు. ఇతర హీరోలకు లైఫ్‌ ఇచ్చాడు. ఆ మూవీస్‌ ఏంటి? ఆ హీరోలెవరు?

 

డార్లింగ్‌ మరోసారి తన రేంజ్‌ని చూపించాడు. ఇండియన్‌ బాక్సాఫీసు వద్ద తనని మించిన హీరో లేరని మరోసారి నిరూపించారు. `కల్కి 2898ఏడీ` చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ మూవీ రెండు రోజుల్లోనే మూడు వందల కోట్లకు రీచ్‌ అయ్యింది. మూడో రోజుతో నాలుగు వందల కోట్ల మార్క్ ని దాటబోతుంది. ఈ ఆదివారం కూడా భారీగా కలెక్షన్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.  

 

`కల్కి 2898ఏడీ` బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ దిశగా వెళ్తుందని చెప్పొచ్చు. ఈ సినిమా లాంగ్‌ రన్‌లో వెయ్యి కోట్ల మార్క్ ని రీచ్‌ అవుతుందని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే ఇండియన్‌ సినిమాలో ఇదొక పెద్ద రేంజ్‌ హిట్‌ మూవీ అవుతుందని చెప్పొచ్చు. అయితే `ఆర్‌ఆర్‌ఆర్‌`, `కేజీఎఫ్‌2`లను దాటుతుందా అనేది చూడాలి. సోమవారం నుంచి వచ్చే కలెక్షన్లని బట్టి ఈ సినిమా రేంజ్‌ ఏంటనేది తెలియాల్సి ఉంది. 

 

ఇదిలా ఉంటే ప్రభాస్‌ కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రభాస్‌ రిజెక్ట్ చేసిన సినిమాలకు సంబంధించిన మ్యాటర్‌ ఆసక్తికరంగా మారింది. 22ఏళ్ల కెరీర్‌లో 23 సినిమాలు చేశారు ప్రభాస్‌. అయితే ఈ క్రమంలో కొన్ని బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను వదులుకున్నారు. డార్లింగ్‌ రిజెక్ట్ చేయడంతో ఆయా కథలతో సినిమాలు చేసిన ఇతర హీరోలు సూపర్‌ స్టార్లుగా ఎదగడం విశేషం. 

 

అందులో ఒకటి `ఒక్కడు` మూవీ. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్‌ బాబు, భూమిక నటించారు. ఈ చిత్రం మహేష్‌ని బిగ్‌ బ్రేక్‌ ఇవ్వడంతోపాటు స్టార్‌ హీరోని చేసింది. ఈ మూవీ స్టోరీ మొదట ప్రభాస్‌ వద్దకే వచ్చింది. కానీ ఆయన స్క్రిప్ట్ నచ్చక రిజెక్ట్ చేశాడట. 

 

దీంతోపాటు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, భూమిక జంటగా వచ్చిన `సింహాద్రి` సినిమా కథని మొదట ప్రభాస్‌కే చెప్పాడట జక్కన్న. కానీ డార్లింగ్‌ నో చెప్పాడట. ఆ తర్వాత ఎన్టీఆర్‌ వద్దకు వెళ్లింది. తారక్‌ చేసి బిగ్‌ బ్రేక్‌ని అందుకున్నారు. కమర్షియల్‌ బిగ్గెస్ట్ హిట్‌ మూవీ. ఈ చిత్రంతోనే స్టార్‌ ఇమేజ్‌ అందుకున్నారు తారక్‌. 

 

`ఆర్య` సినిమా బన్నీ కెరీర్‌ని మలుపు తిప్పిన మూవీ. ఆయనకది రెండో చిత్రం. సరికొత్త క్రేజీ లవ్‌ స్టోరీ. దర్శకుడు సుకుమార్‌ మ్యాడ్‌గా ఈ మూవీని రూపొందించారు. బన్నీ అంతే మ్యాడ్‌గా చేశారు. కుర్రకారు ఎగబడి చూశారు. అల్లు అర్జున్‌ బిగ్‌ బ్రేక్‌తోపాటు స్టార్‌ ఇమేజ్‌ని తెచ్చిన చిత్రమిది. మొదట ఈ కథ ప్రభాస్‌ వద్దకు వెళ్లిందట. కానీ డార్లింగ్‌ తనకు సెట్‌ కాదని నో చెప్పాడట. 

 

`నాయక్‌` చిత్రం రామ్‌ చరణ్‌కి మాస్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చిన మూవీ. వివి వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌కి జోడీగా కాజల్‌, అమలాపాల్‌ నటించారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. చరణ్‌కి మాస్‌ ఇమేజ్‌ని తెచ్చింది. ఈ కథని వినాయక్‌ మొదట ప్రభాస్‌కే చెప్పారట. కానీ ఆయన రిజెక్ట్ చేశాడు. 

 

ఎన్టీఆర్ నటించిన మరో హిట్‌ మూవీ `బృందావనం`. ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. వంశీపైడిపల్లి రూపొందించిన ఈ చిత్రంలో తారక్‌కి జోడీగా సమంత, కాజల్‌ నటించారు. ఈ చిత్రం పెద్ద హిట్‌. వరుస పరాజయాల్లో ఉన్న ఎన్టీఆర్‌కి మంచి హిట్‌ ఇచ్చి గాడిన పడేసింది. ఈ కథ కూడా మొదట ప్రభాస్‌ వద్దకే వెళ్లిందట. 

మాస్‌ మహారాజా రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ మూవీలో `కిక్‌` ఒకటి. సురేందర్‌రెడ్డి రూపొందించిన ఈ మూవీలో రవితేజ, ఇలియానా నటించారు. ఈ సినిమా కథని మొదట ప్రభాస్‌కి చెప్పారట. కానీ ఆయన నో చెప్పారట. దీంతో రవితేజ ఓకే చెప్పాడు. పెద్ద హిట్‌ అందుకున్నాడు. 

 

దర్శకుడు వివి వినాయక్‌ మరో సినిమా కథని కూడా ప్రభాస్‌తో చేయాలనుకున్నారు. `దిల్‌` కథని ముందు ఆయనకే చెప్పాడట. కానీ రిజెక్ట్ చేశాడు. దీంతో నితిన్‌తో చేశాడు వినాయక్‌. ఈ మూవీ పెద్ద హిట్‌ అయి నితిక్‌ని స్టార్‌ని చేసింది. 

 

వీటితోపాటు `ఊరసవెల్లి`, `డాన్‌ శీను`, `జిల్‌` చిత్రాలు కూడా ప్రభాస్‌ వద్దకు వెళ్లాయట. ఆయన రిజెక్ట్ చేశారు. ఇవి పెద్దగా ఆడలేదు. కానీ ముందు చెప్పిన సినిమాలన్నీ పెద్ద హిట్‌ చిత్రాలు. ఆయా సినిమాలతో ఆయా హీరోలు స్టార్‌ ఇమేజ్‌ని పెంచుకున్నారు. ఆయా సమయంలో ప్రభాస్‌ ఫెయిల్యూర్‌ మూవీస్‌ చేయడం గమనార్హం. 

2024-06-30T05:45:52Z dg43tfdfdgfd