Trending:


Insta Reels Viral: ఎవడ్రా నన్ను ఆపేది.. ట్రాఫిక్‌ ఆపి రోడ్డుపై కుర్చీ వేసుకుని ఇన్‌స్టా రీల్స్‌

Stunts Busy Road For Insta Reels In New Delhi: నేటి యువతకు సోషల్‌ మీడియాలో స్టార్లుగా కావాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. వీరి ప్రవర్తనతో స్థానికులు.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఏ కరెక్షన్ చెప్పలేకపోయా.. చక్కగా తీశాడు : సుకుమార్

Prasanna Vadanam director సుకుమార్ శిష్యుడు అర్జున్ తీసిన ప్రసన్న వదనం మూవీ మే 3న రాబోతోంది. ఈక్రమంలో శుక్రవారం నాడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో సుకుమార్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. సుహాస్‌ని ఫ్యూచర్ నాని అంటూ సుకుమార్ పొగిడేశాడు. ఇక తన శిష్యుడు తీసిన మూవీని మెచ్చుకున్నాడు. సినిమా ఆల్రెడీ చూశానని, ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేకపోయానని అన్నాడు.


అల్లు అరవింద్ కొత్త లగ్జరీ కారు చూశారా..? కాస్ట్ తో పాటు కారులో ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవుతారు..?

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు అల్లు అరవింద్. భారీ సినిమాలతో పాటు.. చిన్న సినిమాలు కూడా నిర్మిస్తూ వస్తున్నారు అరవింద్. ప్రస్తుతం ఆయన నాగచైతన్యతో తండేల్ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇది ఇలా ఉంచితే.. అల్లుఅరవింద్ తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఆయన బీ.ఎమ్.డబ్ల్యూ ఐ7 బ్రాండ్ కారును కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఈ కారులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులోనే ఈ కారు ఎలక్ట్రిక్...


జ్యోతిక ప్రవర్తన సరిగా లేదు.. కుటుంబం పరువు తీసింది అంటూ... తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు,

ప్రముఖ నటి.. హీరో సూర్య భార్య జ్యోతికపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. తమిళ సినిమా విమర్శకుడు, నటుడు బైల్వాన్ రంగనాథన్. జ్యోతిక సూర్య కుటుంబం పరువు తీసిందన్నారు. కారణం ఏంటంటే..? తమిళంలోనే కాదు.. సౌత్ అంతట.. స్టార్ కపుల్ అంటే గుర్తుకువచ్చేవారిలో సూర్య - జ్యోతిక గుర్తుకు వస్తారు. సౌత్ సినిమాలో తమ ప్రత్యేకత చూపించుకున్న సూర్య ‌- జ్యోతిక.. చాలా కాలం ప్రేమించుకుని.. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి బెస్ట్ కపుల్ అనిపించుకుంటూ...


తనకంటే ముందే పెండ్లి చేసుకున్నాడని.. ఇల్లు తగలబెట్టిన అన్న

తనకంటే ముందే పెండ్లి చేసుకున్నాడని.. ఇల్లు తగలబెట్టిన అన్న నిజామాబాద్​, వెలుగు : తనకు పెండ్లి కాకుండానే తమ్ముడు చేసుకున్నాడనే కోపంతో తమ్ముడుతో పాటు అతడి భార్యపై దాడి చేయబోయిన అన్న వారు దొరక్కపోవడంతో చివరకు వారుంటున్న ఇం టిని పెట్రోల్​పోసి కాలబెట్టాడు. నిజామాబాద్​కు చెందిన మజ్​హర్, అమర్ అన్నదమ్ములు. అన్న మజ్​హర్​కు పెండ్లి కాలేదు. తమ్ముడు అమర్​ హైదర...


ఫ్యూచర్ నాని.. సుహాస్‌పై సుక్కు

సుహాస్ నటించిన ప్రసన్న వదనం సినిమాను సుకుమార్ శిష్యుడు తీశాడు. ఈ మేరకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సుకుమార్ సందడి చేశాడు. సుహాస్ అద్భుతంగా నటిస్తాడని, ఫ్యూచర్ నాని అవుతాడని చెప్పుకొచ్చాడు. నాని నేచురల్ నటుడు అయితే.. సుహాస్ మట్టి నటుడు అని ప్రశంసించాడు. సుకుమార్ ఇచ్చిన ఈ స్పీచ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. బన్నీ ఎప్పుడూ కూడా సుహాస్ గురించి చెబుతుంటాడట.


'సింగం' సినిమా రిపీట్.. ఇంటర్నేషనల్‌ సైబర్ రాకెట్‌ గుట్టు రట్టు చేసిన సిరిసిల్ల పోలీసులు

ఓ సాధారణ పోలీస్ అధికారి.. ఓ కేసు విషయంలో నిందితున్ని అరెస్ట్ చేసేందుకు విదేశాలకు వెళ్లి మరీ.. అక్కడి పోలీసుల సహాయంతో నిందితున్ని ఇండియాకు లాక్కొస్తాడు. అచ్చం అలాంటి సీన్ రిపీట్ చేశారు సిరిసిల్ల పోలీసులు. అయితే.. విదేశాలకు వెళ్లి మరీ నిందితున్ని ఇండియాకు లాక్కు రాలేదు కానీ.. అక్కడే జరుగుతున్న అతిపెద్ద సైబర్ ముఠా గుట్టు రట్టు చేశారు సిరిసిల్ల పోలీసులు. ఆ సైబర్ ముఠా చెరలో చిక్కుకున్న ఓ బాధితున్న కాపాడి స్వదేశానికి తీసుకొస్తున్నారు.


త్రివిక్రమ్ ఉన్నంత వరకు వరుస హిట్లు.. చిరంజీవి సినిమా అందుకే పోయింది

టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో విజయ్ భాస్కర్ ఒకరు. స్వయం వరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలన్నీ ఈయన దర్శకత్వంలోనే వచ్చాయి. టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో విజయ్ భాస్కర్ ఒకరు. స్వయం వరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలన్నీ ఈయన దర్శకత్వంలోనే వచ్చాయి. అయితే విజయభాస్కర్ హిట్ చిత్రాల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర ఎంతైనా ఉంది. నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు,...


అసలు సినిమా ముందుంది.. ఇది జస్ట్​ ట్రైలరే: ప్రతిపక్షానికి మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్

అసలు సినిమా ముందుంది.. ఇది జస్ట్​ ట్రైలరే: ప్రతిపక్షానికి మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్ పెద్దపల్లి/ముత్తారం, వెలుగు: రాష్ట్రంలో ప్రతిపక్షాలకు అసలు సినిమా ముందుందని, ఇప్పుడు నడుస్తుందంతా ట్రైలరేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గాలికి కూలిపోయే బ్రిడ్జిలు కట్టిన ఘనత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీదని, కూలిన నిర్మాణాలపై విచారణ జరిపించి చర...


60 ఏళ్ల అందానికి మిస్ యూనివర్స్ కిరీటం దాసోహం - చరిత్రలో ఇదే తొలిసారి

Miss Universe Alejandra Marisa: అందాల పోటీలో పాల్గొనడానికీ పనికొస్తానా..అని అనుకోలేదు. ఈ వయసులో ఈ పనేంటని వెనక్కి తగ్గలేదు. పోటీ చేసింది. కిరీటాన్ని సాధించింది. అర్జెంటీనాకి చెందిన అలెజండ్రా మరిసా రోడ్రిగ్వెజ్ (Alejandra Marisa Rodriguez) ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. 60 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ పోటీలో (Miss Universe Buenos Aires) పాల్గొనడమే కాకుండా ఆ టైటిల్‌నీ గెలుచుకుంది. అర్జెంటీనాలోని బ్యునెస్ ఎయిర్స్ (Buenos Aires)లో జరిగిన ఈ అందాల...


Kalki 2898 AD: కల్కి సినిమాకు కష్టకాలమే.. కంగారుపడుతున్న ఫ్యాన్స్

Kalki 2898 AD: కల్కి సినిమాకు కష్టకాలమే.. కంగారుపడుతున్న ఫ్యాన్స్ పాన్ ఇండియా స్టార్  ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD). క్రియేటీవ్ దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అశ్విని దత్ తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశం తో హాలీవుడ్ ర...


ప్రభాస్ కల్కి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

ప్రభాస్ కల్కి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది ప్రభాస్ హీరోగా మహనటి ఫేమ్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD). భారీ అంచనాలతో రూపోందుతున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా కల్కి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు...


''కేసీఆర్ గారు... మీరు మారిపోయారండీ'' : బిఆర్ఎస్ బాస్ తీరుపై ప్రజల అభిప్రాయమిదే..!

హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరులో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారాన్ని, సీఎం పదవిని కోల్పోయిన తర్వాత అనారోగ్య కారణాలతో ఇంటికే పరిమితమైన కేసీఆర్ ఇటీవలే మళ్లీ యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల వేళ తన శైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు కేసీఆర్. ముఖ్యమంత్రిగా పదేళ్లుగా ఎన్నడూ చూడని కేసీఆర్ ను ప్రస్తుతం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు కేసీఆర్ ప్రయత్నాలను చూస్తున్న...


Gajakesari Yoga 2024: గజకేసరి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది.. ధన లాభాలే లాభాలు!

Gajakesari Yoga 2024 In Telugu: మే మొదటి వారంలో ఎంతో శక్తివంతమైన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ క్రింది రాశుల వారికి విపరీతమైన ధన లాభాలతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడి నుంచి విముక్తి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.


Ramayana: సీతారాములుగా రణ్బీర్, సాయి పల్లవి.. రామాయణ సెట్స్ నుండి ఫొటోస్ లీక్

Ramayana: సీతారాములుగా రణ్బీర్, సాయి పల్లవి.. రామాయణ సెట్స్ నుండి ఫొటోస్ లీక్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ(Nitesh Tiwari) రామాయణ(Ramayana) ఇతిహాసాన్ని తెరపై ఆవిష్కరించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం భారతీయ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి(Sai Pallavi) నటిస్...


Agent: ఏజెంట్ సినిమాకి ఏడాది.. ఇంకా ఓటీటీకి రాని అయ్యగారు

ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమా థియేటర్లో రిలీజైన నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ అఖిల్ అక్కినేని యాక్ట్ చేసిన ఏజెంట్ సినిమాకి ఏడాది పూర్తయినా ఇంకా ఓటీటీ మోక్షం రాలేదు. ఇప్పటికీ అఖిల్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.


మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు అరెస్ట్

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు అరెస్ట్ ముంబై సైబర్ సెల్ పోలీసులు మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పరారీలో ఉన్న యాక్టర్ సాహిల్ ఖాన్ ను ఆదివారం పట్టుకున్నారు. అతను వేసిన మధ్యంతర బెయిల్ ముంబై హైకోర్టు తిరస్కరించడంతో ఆ రాష్ట్రం నుంచి అతను పారిపోయాడు. ఈ రోజు ఉదయం చత్తీష్ గడ్ పోలీసుల సహాయంతో ముంబై సైబర్ సెల్  స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చత్తీష్ గడ్ రాష్ట్...


చైన్​ స్నాచింగ్ చేస్తున్న డ్యాన్సర్లు అరెస్ట్

చైన్​ స్నాచింగ్ చేస్తున్న డ్యాన్సర్లు అరెస్ట్ హైదరాబాద్‌‌, వెలుగు : ఈజీ మనీ కోసం ఒంటరి మహిళలను టార్గెట్‌‌ చేసి, చైన్ స్నాచింగ్‌‌కు పాల్పడుతున్న ఇద్దరు డ్యాన్సర్లను సౌత్‌‌ఈస్ట్‌‌ జోన్ టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 9.9 గ్రాముల గోల్డ్‌‌ చైన్, బైక్, సెల్‌‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌‌ఫోర్స్‌‌ డీసీపీ రష్మీ పెరుమాల్‌‌ తెలిపిన...


సూర్యపేటలో ప్రేమజంట ఆత్మహత్య

సూర్యపేటలో ప్రేమజంట ఆత్మహత్య సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది.   ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మల పెన్ పాహాడ్ గ్రామంలో పురుగు మందు తాగి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన ప్రేమికులు గుండగాని సంజయ్  (26), చల్లగుండ నాగజ్యోతి (24)  ఇద్దరు  కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు అడ్డుపడుతుండటంతో పురుగుల మందు తా...


శ్రీలీల ఐటమ్ సాంగ్.. స్టార్ హీరో సినిమాలో ..? భారీగా డిమాండ్ చేస్తున్న బ్యూటీ..?

మూవీ కెరీర్ పీక్స్ లో ఉండగానే .. హీరోయిన్ శ్రీలీల ఓ సాహసం చేయబోతుందట. ఈమె ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఫ్యాస్స్ షాక్ అవుతున్న ఈ న్యూస్ లో నిజం ఎంత..? అసలు ఏ హీరో సినిమాలో ఆమె సాంగ్ చేయబోతోంది. శ్రీలీల..ఒకే ఒక్క ప్లాప్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సీనియర్ .. జూనియర్ అని తేడా లేకుండా.. తండ్రి వయస్సున్న హీరోలతో కూడా నటించి మెప్పించింది బ్యూటీ. రీసెంట్ గా మహేష్ బాబు కాంబినేషన్ లో గుంటూరు కారం సినిమాలో నటించిన బ్యూటీ.. తన...


Trigrahi Yog : త్రిగ్రాహి యోగం ఈ రాశులవారికి లాభం!

Trigrahi Yog 2024 మేష రాశి త్రి గ్రాహి యోగం వల్ల ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీలో సృజనాత్మకత ఉంటుంది. చేసే పనిలో మంచి ఫలితాలు పొందుతారు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యలు తీరిపోతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వృషభ రాశి విద్య, వృత్తి, సంపద, వ్యాపారం, వైవాహిక జీవితానికి ఇది గొప్ప సమయం. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. పోటీ పరీక్షలలో విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. మిథున రాశి ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. శత్రువులు మీ...


Bandi sanjay: గులాబీ బాస్ ను పొట్టుపొట్టు తిట్టిన బండిసంజయ్..

Bjp leader bandi sanjay sensational comments on former cm kcr pa


సుహాస్ సినిమా ఈవెంట్‌లో బుచ్చిబాబు కామెడి

సుహాస్ ప్రసన్న వదనం సినిమాను సుకుమార్ శిష్యుడు అర్జున్ తెరకెక్కించాడు. రీసెంట్‌గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సుకుమార్, బుచ్చిబాబు గెస్టులుగా వచ్చారు. ఇక ఈ ఈవెంట్‌లో సుకుమార్ ఎదుటనే బుచ్చిబాబు ఫన్నీగా స్పీచ్ ఇచ్చాడు. సుకుమార్ వల్లే తామంతా ఇంత మంచి డైరెక్టర్లుగా పేరు తెచ్చుకుంటున్నామని అన్నాడు.


Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డకి ఇకముందే అసలైన పరీక్ష.. టిల్లు స్క్వైర్ లెక్కలోకి రాదు

Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డకి ఇకముందే అసలైన పరీక్ష.. టిల్లు స్క్వైర్ లెక్కలోకి రాదు డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుండి ఉన్నప్పటికీ డీజే టిల్లు తరువాతనే ఫేమ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన టిల్లు స్క్వైర్ హిట్టుతో మనో...


30న సాయి స్వామి మెటల్స్ ఐపీఓ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

30న సాయి స్వామి మెటల్స్ ఐపీఓ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూఢిల్లీ: స్టెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తయారు చేసే సాయి స్వామి మెటల్స్ అండ్ అల్లోయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ నెల 30 న ఇన్వెస్టర్ల ముందుకు రాబోతోంది.  ఐపీఓ ద్వారా రూ.15 కోట్లు సేకరించనుంది. ఈ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


వాళ్ళ కోరికలు తీర్చింది, నాలుగుసార్లు దొరికిపోయింది... జబర్దస్త్ వర్ష పై ఇమ్మానియేల్ సంచలన కామెంట్స్

జబర్దస్త్ వర్షపై ఇమ్మానియేల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఫోన్ హిస్టరీ చెక్ చేస్తే వర్ష నాలుగు సార్లు దొరికిపోయింది అన్నాడు. వాళ్ళ కోరికలు తీరుస్తున్నావు కానీ... నా కోరికలు తీర్చడం లేదని ఓపెన్ అయ్యాడు. సీరియల్ నటి వర్ష జబర్దస్త్ కమెడియన్ గా మారి సక్సెస్ అయ్యింది. ఈ షో వేదికగా ఆమె బుల్లితెర స్టార్ గా ఎదిగింది. కమెడియన్ ఇమ్మానియేల్ తో ఆమె లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇమ్మానియేల్ అంటే తనకెంతో ఇష్టం అని వర్ష ఓపెన్ గానే చెప్పేది....


Tamanna Simhadri: అప్పుడు నారా లోకేష్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ - బలమైన ప్రత్యర్థులపై బిగ్ బాస్ కంటెస్టెంట్ పోటీ

Tamanna Simhadri Contests Against Pawan Kalyan In Pithapuram: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో.. ముఖ్యంగా పిఠాపురంలో పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. ఈ ఏడాది ఎలా అయినా జనసేనను గెలిపించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. అందుకే సినీ సెలబ్రిటీలు సైతం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రచారానికి మద్దతునివ్వడానికి ముందుకొస్తున్నారు. ఇక ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్‌కు పోటీగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన తమన్నా సింహాద్రి రంగంలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో...


ఇవాళ గురుకుల డిగ్రీ, ఇంటర్ ఎంట్రన్స్ టెస్ట్

ఇవాళ గురుకుల డిగ్రీ, ఇంటర్ ఎంట్రన్స్ టెస్ట్ 65 వేలకు పైగా అప్లికేషన్లు హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లకు ఆదివారం నిర్వహించనున్న ఎంట్రన్స్ టెస్ట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలంగాణ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల సొసైటీ సెక్రటరీ సైదులు తెలిపారు. 2024–-25 అకడమిక్ ఇయర్ కు అడ్మిషన్ కోసం ని...


వేరొకరి భూమిని తన భూమిగా.. ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొన్న వినోద్​కుమార్​

వేరొకరి భూమిని తన భూమిగా.. ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొన్న వినోద్​కుమార్​ సొంతూరు ఏనుగల్లులో 251/బీ సర్వే నంబర్ లో భూమి ఉన్నట్లు వెల్లడి ధరణిలో ఆ నంబర్ పై‌ మరొక వ్యక్తి పేరిట 14  గుంటలు  తన భార్య పేరుపై ఉన్న ల్యాండ్  వివరాల్లోనూ తప్పులు  వినోద్  తండ్రి మురళీధర్ రావు పేరిట ధరణిలో 1.10 ఎకరాల ప్రభుత్వ భూమి నమోదు కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్  కరీంనగర్  ...


కెజియఫ్ స్టార్ యష్ న్యూ లుక్ చూశారా..? గుర్తు పట్టనంతగా మారిపోయిన హీరో..

ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు కెజియఫ్ హీరో యష్.. న్యూ లుక్ లో మెరిసిపోతున్నాడు కన్నడ స్టార్ హీరో. గుర్తు పట్టనంతగా మారిపోయాడు. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియ స్టార్ గా మారాడు కన్నడ స్టార్ హీరో యష్. కెజియఫ్ సినిమాలు అతని కెరీర్ ను మార్చుశాయి. దేశ వ్యాప్తంగా ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. అంతే కాదు ఎక్కడో కనిపించకుండా కామ్ గా ఉన్న కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టిన సినిమా కెజియఫ్. దాంతో యశ్ నెక్స్ట్ సినిమాలనై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే...


ఆన్సర్ షీట్‌ని జైశ్రీరామ్‌తో నింపేశారు, పాస్ అయ్యారు - కరెక్ట్ చేసిన ప్రొఫెసర్‌లు సస్పెండ్

UP Students Answer Sheet: యూపీలో పూర్వాంచల్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్‌లు ఆన్సర్ షీట్‌లో జైశ్రీరామ్ అని రాసిన విద్యార్థులను పాస్ చేశారు. ఆన్సర్స్‌కి బదులుగా జైశ్రీరామ్ అని రాస్తే వాటిని కొట్టేయాల్సింది పోయి కరెక్ట్ చేసి పాస్ చేయడంపై యాజమాన్యం ఫైర్ అయింది. ఆ ఇద్దరు ప్రొఫెసర్‌లనూ సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఈ నిర్ణయం తీసుకుంది. D Pharma స్టూడెంట్స్‌ ఆన్సర్ షీట్‌లో ఇలా జైశ్రీరామ్‌తో పాటు కొందరి క్రికెటర్‌ల పేర్లు...


Chota K Naidu: హరీశ్ శంక‌ర్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన చోటా కే నాయుడు

Chota K Naidu Reveals Issue With Director Harish Shankar : టాలీవుడ్ లోని సీనియ‌ర్ కెమెరామెన్లలో ఒక‌రు చోటా కే నాయుడు. ఎన్నో సినిమాలు చేసిన అనుభ‌వం ఆయ‌న‌ది. ఎంతోమంది డైరెక్ట‌ర్ల‌తో ప‌నిచేశారు. అయితే, త‌న‌కు కోపం చాలా ఎక్కువ అని, ర‌గిలిపోతాన‌ని చెప్తున్నారు. ఆ కోపం కూడా ఎక్కువ సేపు ఉండ‌ద‌ని అంటున్నారు. ఒక్కోసారి డైరెక్ట‌ర్లు వాళ్లు చెప్పిన‌ట్లు మాత్ర‌మే వినాల‌ని అంటార‌ని, అలాంట‌ప్పుడు వాళ్ల‌కే వ‌దిలేస్తాన‌ని అంటున్నారు. ఇలా త‌న అనుభ‌వాల‌ను...


Chanakya Niti Telugu : వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా చేయాల్సిన పనులు

Chanakya Niti In Telugu : ఎక్కువ రోజులు జీవించాలని అందరికీ ఉంటుంది. కానీ మనకు ఉన్న అలవాట్లే మనల్ని ఎక్కువ రోజులు బతకకుండా చేస్తాయని చాణక్య నీతి చెబుతుంది. కొన్ని విషయాలను తప్పకుండా పాటించాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.


Jayasudha: అందరినీ అలా పిలిచే అలవాటు నాకు లేదు, ఇండస్ట్రీలో ఆ ఇద్దరే నాకు అన్నయ్యలు - జయసుధ

Jayasudha: సీనియర్ నటి జయసుధకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అలవాటు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయసుధ.. ఇండస్ట్రీలో తను సన్నిహితంగా ఉండేవారి గురించి చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తను నిర్మాతగా తెరకెక్కించిన ‘హ్యాండ్సప్’ సినిమా విశేషాలను గుర్తుచేసుకున్నారు. అసలు ఆ మూవీలో నటించడానికి చిరంజీవి ఎలా ఒప్పుకున్నారు? మూవీ చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి అని బయటపెట్టారు జయసుధ. అలవాటు లేదు.. ‘‘ఇండస్ట్రీలో కొంతమందిని నేను కుటుంబ సభ్యులుగా భావిస్తాను. కానీ...


తెలంగాణలో చిత్రవిచిత్ర సంఘటనలు జరుగుతున్నయ్... కేసీఆర్ ​ట్వీట్​

తెలంగాణలో చిత్రవిచిత్ర సంఘటనలు జరుగుతున్నయ్... కేసీఆర్ ​ట్వీట్​ హైదరాబాద్: రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని మాజీ సీఎం కేసీఆర్​ ట్వీట్ ​చేశారు.   ‘నేను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంట్ పోయింది. ప్రతి...


ప్రాచీ నిగమ్: స్టేట్ ‌టాపర్‌ అమ్మాయికి మీసాలు ఉన్నాయంటూ ఆన్ లైన్‌లో ట్రోలింగ్, బాధితురాలు ఏమన్నారు?

ఫలితాలు వచ్చిన తొలి రెండు రోజుల తర్వాత నుంచి సోషల్ మీడియా చూడటం మానేశారు ప్రాచీ . ఆ ట్రోల్స్ తన చదువుల మీద ప్రభావం చూడకూడదన్నది ఆమె భావన.


Mrunal Thakur: ఆ సీన్ చేసేందుకు మృణాల్‌కు 3 గంటలు పట్టిందట, చివరికి మాజీ ప్రియుడిని ఊహించుకుని..

Mrunal Thakur & Shahid Kapoor: 'సీతారామం', 'హాయ్ నాన్న‌'.. తెలుగులో చేసిన ఈ రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి మృణాల్ కి. ఇక రెండు సినిమాల్లో ఆమె యాక్టింగ్, క‌ట్టు, బొట్టు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. తెలుగింటి అమ్మాయిలా చ‌క్క‌గా ఉందంటూ ప్ర‌శంస‌లు వ‌చ్చాయి మృణాల్ కి. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఆమె. ఈ మ‌ధ్యే 'ఫ్యామిలీ స్టార్' తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఎన్నో హిందీ సీరియ‌ల్స్ లో న‌టించిన మృణాల్.. షాహిద్ క‌పూర్ తో క‌లిసి ‘జర్సీ’...


రామయ్య తండ్రి భద్రాద్రి లో వెలిసినట్లు మొదటగా చెప్పిన మహా భక్తురాలు ఎవరంటే ?

ఆలయాలలో భగవంతుడికి నిత్యం చేసే ఆరాధన సమయంలో ఐదు పాత్రలు వినియోగిస్తారు. వాటికి పంచపాత్రలని పేరు. ఇందులో తీర్థంతోనే స్వామికి పరిపూర్ణమైన ఆరాధన చేస్తారు. అర్ఘ్యపాత్ర, పాద్యపాత్ర. ఆచమనీయపాత్ర. స్నానపాత్ర. శుద్దోకపాత్రతో ఎలాగైతే ఆరాధన సమగ్రంగా ఉంటుందో అలాగే భద్రాద్రి రాముని ఆరాధనలో కూడా ఇంత పరిపుష్టం కావడానికి ఆ ఐదుగురు మహాభక్తుల పాత్రలు పంచపాత్రలుగా ఈ క్షేత్రంలో ప్రకాశిస్తున్నాయి. ఆ ఐదుగురే భద్రమహర్షి, పోకల దమ్మక్క భక్త రామదాసు, తానీషా, తూము...


Harish Shankar: ఏడుస్తూనే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు, ఆరోజంతా బస్ స్టాప్‌లోనే పడుకున్నా - హరీష్ శంకర్

Harish Shankar About Career Struggles: సినిమాల్లోకి రావడం ఎంత కష్టమో.. ఇక్కడ సక్సెస్ అవ్వడం కూడా అంతే కష్టమని చాలామంది అంటుంటారు. అయినా కష్టమైన సరే.. సినిమాల్లోనే ఉంటాను అనుకునేవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఒకరు. ముందుగా రైటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన హరీష్.. కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కున్నానని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. రోజుకు కనీసం ఒక్క పూట కూడా తినకపోవడం, రోడ్డు మీదే పడుకోవడం...


Money Astrology: ఏప్రిల్ 28 ధన జ్యోతిష్యం. వారికి కెరీర్ అవకాశాలు పెరుగుతాయి

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. ఏప్రిల్ 28వ తేదీ, ఆదివారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):ఫీల్డ్‌లో ఆశించిన రీతిలో పనితీరు మెయింటైన్ చేస్తారు. ఆర్థిక, వాణిజ్యపరమైన పనులు చేస్తారు. పూర్వీకులు, సంప్రదాయ వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో సానుకూలత ఉంటుంది. అందరినీ కలుపుకొని వెళ్తారు. సంపద వృద్ధి చెందుతుంది. ఆర్థిక రంగం మెరుగుపడుతుంది. పరిహారం: రామాలయంలో జెండా సమర్పించండి. వృషభం (Taurus):అన్ని రంగాల్లోనూ ఎఫెక్టివ్‌గా పని చేస్తారు. ధైర్యం చురుకుదనాన్ని, అవగాహనను పెంచుతుంది. ఆర్థిక, వాణిజ్య రంగంలో విశిష్టమైన పనులు చేయాలనే ఆలోచన ఉంటుంది. ఫలితాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంటాయి. మంచి ఆఫర్లను అందుకుంటారు. సామరస్య వాతావరణం ఉంటుంది. మీ ప్లాన్లకు బలం చేకూరుతుంది. పరిహారం- సరస్వతి అమ్మవారికి తెల్లటి పూల మాల సమర్పించండి. మిథునం (Gemini):ఓర్పు, నమ్మకంతో ముందుకు సాగుతారు. పనిలో అత్యాశ, ప్రలోభాలకు గురికావద్దు. ఆర్థిక ప్రయత్నాలలో జాగ్రత్త పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారంపై దృష్టి సారిస్తారు. దేంట్లోనూ తొందరపాటు చూపరు. రిస్క్ ఉండే పనులకు దూరంగా ఉంటారు. ప్లాన్ల అమలును పెంచుతారు. పరిహారం: ఎర్రటి ఆవుకు బెల్లం తినిపించండి. కర్కాటకం (Cancer):లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు. పరిస్థితులపై నియంత్రణ కొనసాగిస్తారు. సంపద వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో విజయాలు పెరుగుతాయి. ఆఫీసర్ క్లాస్ వ్యక్తులు సంతోషంగా ఉంటారు. ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాపారాలు మెరుగుపడతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. పరిహారం: సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించండి. సింహం (Leo):కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసి, పనులు మేనేజ్ చేయండి. కమర్షియల్ పనుల్లో వేగం ప్రదర్శిస్తారు. యాక్షన్ ప్లాన్స్ ఊపందుకుంటాయి. మీ ప్రతిభ, పనితీరు మెరుగుపడుతుంది. పనిలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారిస్తారు. సహోద్యోగులతో సమన్వయం పెరుగుతుంది. పరిహారం: శివునికి నీటిని సమర్పించండి. కన్య (Virgo):వృత్తి, వ్యాపారాల్లో సుఖంగా ఉంటారు. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు లభిస్తాయి. లాభం, విస్తరణపై దృష్టి పెడతారు. పరిశ్రమ ఉత్పత్తులు మెరుగుపడటం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ మీ యాక్టివిటీతో ప్రభావితమవుతారు. వివిధ రంగాల్లో శుభం ఉంటుంది. పరిహారం: హనుమంతోని గుడిలో నెయ్యి దీపం వెలిగించండి. తుల (Libra):ఆఫీస్‌లో అవగాహన, వినయంతో పని పూర్తి చేస్తారు. పరిస్థితులపై నియంత్రణ కొనసాగిస్తారు. ఉద్యోగ వ్యాపారం సాధారణంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలపై దృష్టి సారిస్తారు. రిసెర్చ్ పనులపై ఆసక్తి చూపుతారు. అనుభవజ్ఞులతో సహవాసాన్ని పెంచుకోండి. సలహాదారులతో సన్నిహితంగా ఉండండి. పరిహారం: నల్ల కుక్కకు ఏదైనా తీపి పదార్థం ఇవ్వండి. వృశ్చికం (Scorpio):యాక్షన్ ప్లాన్స్ ముందుకు తీసుకెళ్తారు. టైమ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తారు. దురాశ, ప్రలోభాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఆర్థిక విషయాలపై నియంత్రణ పెరుగుతుంది. పనిలో అవగాహన పెరుగుతుంది. వర్క్‌లో ఓర్పు ప్రదర్శిస్తారు, అప్రమత్తంగా ఉంటారు. అతిగా ఉత్సాహం చూపకూడదు. పరిహారం: పేదవారికి తెల్లటి వస్తువులు దానం చేయండి. ధనస్సు (Sagittarius):పనుల్లో వేగం ఉంటుంది. కొత్త ప్లాన్లు రూపుదిద్దుకుంటాయి. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వ్యాపారం బలంగా ఉంటుంది. మెరుగైన వేగంతో ముందుకు సాగుతారు. మీరు అన్నింట్లోనూ విజయాన్ని పొందుతారు. చాలా కేసులు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రభావం పెరుగుతూనే ఉంటుంది. పరిహారం- పిండి, పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. మకరం (Capricorn):ప్రొడక్టివ్ పనుల పట్ల మొగ్గు పెరుగుతుంది. ఉమ్మడి పనుల్లో ముందుంటారు. సమయం అనుకూలంగా ఉంటుంది. తీవ్రమైన విషయాలపై ఆసక్తి ఉంటుంది. స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. విజయ స్ఫూర్తితో పనులు చేస్తారు. వృత్తిపరమైన పనుల్లో మంచి పనితీరు కనబరుస్తారు. పరిహారం: పక్షికి ఆహారం ఇవ్వండి. కుంభం (Aquarius):ఆర్థిక విషయాల్లో వేగాన్ని కొనసాగిస్తారు. సానుకూల సమయంలో మంచి ప్రయోజనాన్ని పొందుతారు. వృత్తిపరమైన ప్రయత్నాలను కొనసాగిస్తారు. ఒకటి కంటే ఎక్కువ మూలాల నుండి లాభం పొందే మార్గం తెరచుకుంటుంది. కాంటాక్ట్ కమ్యూనికేషన్ మెరుగ్గా ఉంటుంది. ధైర్యం, బలం పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో పనులను వేగవంతం చేస్తారు. పరిహారం: శారీరక వికలాంగులకు సేవ చేయండి. మీనం (Pisces):ఆఫీస్‌లో లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేస్తారు. ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. కెరీర్ అవకాశాలు పెరుగుతాయి, తప్పకుండా ముందుకు వెళ్తారు. విజయ భావం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారంలో మెరుగ్గా రాణిస్తారు. ప్రతిచోటా శుభ ఫలితాలతో మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. పోటీ భావం పెరుగుతుంది. పరిహారం: దుర్గ గుడిలో నెయ్యి దీపం వెలిగించండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


తమ్ముడు పెళ్లి చేసుకున్న అమ్మాయంటే ఇష్టం లేదట.. ఇదేం శాడిజం రా నాయనా, ఏం చేశాడంటే

Nizamabad Man Set Fire To House: తనకు ఇష్టంలేని పెళ్లి తన తమ్ముడు చేసుకున్నాడన్న కోపంతో సోదరుడి భార్య ఇంటికి నిప్పు పెట్టాడు ఓ అన్న. నిజామాబాద్‌లో జరిగిన ఘటన కలకలంరేపింది. తమ్ముడు ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అన్నకు ఇష్టం లేదు.. అయినా సరే తమ్ముడు పెళ్లి చేసుకోవడంత అర్థరాత్రి తన అనుచరులతో వెళ్లి సోదరుడి భార్య ఇంటికి నిప్పంటించాడు. ఈ క్రమంలో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు...


బాలకృష్ణ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? మరోసారి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చిన బాలయ్య..?

నటసింహం నందమూరి బాలకృష్ణకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆయనకు ఇష్టమైన ఆ బ్యూటీకి మరో ఛాన్స్ ఇవ్వబోతున్నాడని తెలుసా..? ప్రస్తుతం వరుస సినిమాలు, అటు పాలిటిక్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు నందమూరి బాలయ్య బాబు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి..ఎలక్షన్ బిజీలో పడిపోయారు. హిందూపురం నుంచి పోటీ చేస్తున్న బాలయ్య..మరోసారి తన గెలుపుపై ధీమా వ్యాక్తం చేశారు. ఈక్రమంలో ఆయన ఎలక్షన్స్ అయిపోయి.. రిజల్ట్ వచ్చేవరకూ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. కాగా...


పుష్ప సుహాస్‌తో చేయాల్సింది.. ‘ప్రసన్న వదనం’ ఈవెంట్‌లో సుకుమార్..

యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్,...


పెళ్లైన నటుడితో ఎఫైర్.. పెళ్లికాకుండానే తల్లి.. ఇద్దరు కూతుళ్లులో ఒకరు సూపర్ స్టార్..

హేమమాలిని, రేఖ, వైజయంతీమాల, జయప్రద, శ్రీదేవి బాలీవుడ్‌లో అడుగు పెట్టకముందు దక్షిణాది సినిమాల్లో పనిచేసింది ఈ నటి. సౌత్ సినిమా నుంచి బాలీవుడ్ లోకి వచ్చి దేశవ్యాప్తంగా ప్రజల గుండెల్లో స్థిరపడింది. రెండు పెళ్లిళ్లు చేసుకున్న దక్షిణాది సినిమా సూపర్ స్టార్‌తో ప్రేమలో పడి, పెళ్లి చేసుకోకుండా, ఇద్దరు కూతుళ్లకు తల్లి అయిన అతికొద్ది మంది నటీమణుల్లో ఈమె కూడా ఒకరు. ఆమె రేఖ తల్లి పుష్పవల్లి.. : Instagram@diva_the_rekha) రేఖ తల్లి పుష్పవల్లి తమిళం, తెలుగు సినిమాల్లో నటించారు. సినిమా తెరపై సంపూర్ణ రామాయణంలో సీత పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆమె 1936లో విడుదలైన ఆ చిత్రంలో సీత పాత్రను పోషించారు. అందుకు ఆమె రూ.300 రెమ్యూనరేషన్ అందుకుననారు. ఈ పాత్ర తరువాత, ఆమెకు చాలా చిత్రాలలో ఆఫర్లు రావడం ప్రారంభించాయి.: Instagram@filmypioneer) రేఖ తల్లి సినిమాల కంటే పర్సనల్ లైఫ్ కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఆమెకు 1940లో వివాహం జరిగింది, కానీ 6 సంవత్సరాల తరువాత, ఆమె వైవాహిక జీవితం దెబ్బతింది. ఆమె తన భర్త నుండి వేరుగా జీవించడం ప్రారంభించింది. అప్పటికే ఆమెకు ఇద్దరు సంతానం. (ఫోటో క్రెడిట్: Instagram@diva_the_rekha) ఆ తర్వాత తమిళ నటుడు జెమినీ గణేశన్‌తో కలిసి 'మిస్ మాలిని' చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడంతో పుష్పవల్లి జీవితంలో కొత్త మలుపు వచ్చింది. రేఖ తల్లి జెమిని గణేశన్ తో ప్రేమలో పడింది, కానీ నటుడికి ఇదివరకే వివాహం జరిగింది. (ఫోటో క్రెడిట్: Instagram@filmypioneer) జెమినీ గణేశన్ పుష్పవల్లికి ఎప్పుడూ భార్య హోదా ఇవ్వలేదు. కానీ రేఖ తల్లి తన జీవితమంతా అతని ప్రేయసిగా గడిపింది. వివాహం కాకుండానే జెమినీ గణేశన్ ఇద్దరు కుమార్తెలకు తల్లి అయింది, వీరిలో ఒకరు ప్రముఖ నటి రేఖ. (ఫోటో క్రెడిట్: Instagram@rekha_the_actress) రేఖ తల్లి పుష్పవల్లి 1991లో కన్నుమూశారు. ఆమె ఎక్కువగా సినిమాల్లో సహాయక పాత్రలు పోషించారు. మరోవైపు పుష్పవల్లి కూతురు రేఖ మాత్రం సినీ ప్రపంచంలో పెద్ద నటిగా ఎదగగలిగింది. (ఫోటో క్రెడిట్: Instagram@rekha_the_actress) రేఖ తనలా సినిమాల్లో నటించాలని పుష్పవల్లి కోరుకుంది. రేఖ తొలిసారి తెలుగు చిత్రం 'రంగుల రాట్నం'లో కనిపించింది. అప్పుడు ఆమె వయసు 12 సంవత్సరాలు మాత్రమే. 15 ఏళ్ల వయసులో తన తొలి బాలీవుడ్ చిత్రం 'అంజనా సఫర్'లో నటించింది. Photo : Instagram పుష్పవల్లి లాగే ఆమె కూతురు రేఖ జీవితం కూడా అల్లకల్లోలంగా మారింది. రేఖ వారి కంటే చాలా పెద్ద సినీ తార అయినప్పటికీ ఆమె మొదటి వివాహం విఫలమైంది. ఆమె చాలా ఫేమస్ అయినా 69 ఏళ్ల వయసులో కూడా ఒంటరిగానే ఉంటోంది. Photo : Instagram


HBD Samantha Ruth Prabhu: సమంత బర్త్ డే స్పెషల్ - ఆమె కూడా మరో సావిత్రేనా? సినిమాల సక్సెస్​కి, కెరీర్​ డౌన్​ఫాల్​కి తనే కారణమా?

Samantha Ruth Prabhu Birthday Today: హీరోయిన్లకు వెండితెరపై లైఫ్‌స్పాన్ చాలా తక్కువగా ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు అంటుంటారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రమే ఆ స్టేట్‌మెంట్ తప్పు అని నిరూపించగలరు. అందులో సమంత కూడా ఒకరు. 2010లో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది సామ్. ఇప్పటికీ సక్సెస్‌ఫుల్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ప్రొఫెషనల్‌గా మాత్రమే కాకుండా.. పర్సనల్‌గా కూడా ఎన్నోసార్లు వార్తల్లో నిలిచింది ఈ భామ. కానీ తనపై ఎన్ని నెగిటివ్...


ప్రభుదేవ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ప్రేమికుడు రీ రిలీజ్.. విడుదల తేదీ ఎప్పుడంటే..

మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవ, అందాల నటి నగ్మ నటించిన ప్రేమికుడు సినిమా రీ-రిలీజ్ అవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ రిలీజ్ కి సంబంధించిన వేడుక నేడు చాలా ఘనంగా...


అచ్చం సింహం లాగానే గర్జిస్తున్న ఐదేళ్ల చిన్నారి.. వీడియో వైరల్

సాధారణంగా చిన్న పిల్లలు చాలా అల్లరి చేస్తూ జీవితాన్ని సంతోషంగా గడిపేస్తుంటారు. ఎప్పుడూ కుతూహలంగా ఉండే వీళ్లు వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడానికి ఇష్టపడతారు. వివిధ శబ్దాలను వింటూ వాటిని ఇమిటేట్ చేయడానికి ట్రై చేయడం మీరు చూసే ఉంటారు. పిల్లలు జంతువుల శబ్దాలను కూడా ఇమిటేట్ చేయడానికి చాలా ఇష్టపడతారు. అయితే ఒక చిన్నారి జంతువుల శబ్దాలను అనుకరించడంలో నైపుణ్యం సాధించింది. చూసేందుకు చాలా క్యూట్‌గా ఉన్న బాలిక అచ్చం సింహం (Lion) లానే గర్జించి...


Panchangam Today: నేటి పంచాంగం. శుక్రమౌడ్యమి ప్రారంభం

నేడు 2024 ఆదివారం, ఏప్రిల్ 28, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, చైత్ర మాసం, బహుళపక్షం, శుక్రమౌడ్యారంబః ఇవాళ 5 గంటల 40 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 21 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి కృష్ణ చవితి. ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకూ ఉంది. తర్వాత పంచమివారం: భానువాసరెనక్షత్రం: మూల, రాత్రి తెల్లవారుజాము 4 గంటల 47 నిమిషాల వరకూ ఉంది. తర్వాత పూర్వాషాడ.యోగం: శివ, రాత్రి 2 గంటల 3 నిమిషాల వరకూ ఉంది. తర్వాత సిద్దకరణం: బాలవ, ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకూ ఉంది. తర్వాత కౌలవ రాత్రి 8 గంటల 8 నిమిషాల వరకూ ఉంది. తర్వాత తైతుల.పితృతిథి: కృష్ణ పంచమిశుభసమయం: ఉ:10.41 (మిథున), రా:08.12 (వృశ్చిక), రా:11.10 (ధనస్సు), రా:12.51(మకర). అమృతకాలం రాత్రి 10 గంటల 18 నిమిషాల నుంచి 11 గంటల 55 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 51 నిమిషాల నుంచి 5 గంటల 42 నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం ఉదయం 4 గంటల 30 నుంచి 6 గంటల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం రాత్రి 3 గంటల 10 నిమిషాల నుంచి 4 గంటల 47 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


బేబీ లైట్​ అంటే తెలియక...

బేబీ లైట్​ అంటే తెలియక... యాక్టర్ అంటే ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకూడదు. అన్నిరకాల పాత్రలు చేయాలి అంటుంటారు చాలామంది. అందుకే అన్ని రకాల పాత్రలు చేసి, మెప్పించే వాళ్లని వర్సటైల్ యాక్టర్స్​ అంటారు. బాలీవుడ్ నటి దివ్యాంక త్రిపాఠి దహియా కూడా ఆ కోవకే చెందుతుంది. ఎందుకంటే ఆమె చేసే పాత్రలు చాలా డిఫరెంట్​గా ఉంటాయి. వర్సటైల్​ యాక్టర్​గా పేరు తెచ్చుకున్న ఆ...


ఏళ్ళకు ఏళ్లుగా పెళ్లి కావట్లేదా.. ఇక్కడ అభిషేకం నిర్వహిస్తే మీ ఇంట బాజాభజంత్రీలు మోగుతాయట

వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడి సైతం శ్రీ కేదారేశ్వర స్వామి వారి ఆలయాన్ని పోలినట్లు ఉండడం గమనించవచ్చు..చెంబుడు నీళ్లు పోస్తే చాలు కోరిన కోర్కేలు తీర్చే భోళాశంకరుడు… ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలుగా పూజలందుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లికాని వారు ఇక్కడకు వచ్చి..భక్తి శ్రద్ధలతో ఆ కేదారేశ్వరుని పూజిస్తే వారికి వెంటనే మంచి జరుగుతుందని ప్రతీతి. అందుకే పెళ్లికాని యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ ఈశ్వరుడిని దర్శించుకుంటారట . కేదారేశ్వరస్వామి (కుమ్మరి గుడి) దేవాలయం..ఈ స్వామి వారికి మహిమాన్వితమైన శక్తులు ఉన్నాయని, ఇక్కడ పెళ్లి కాని వారు స్వామి వారికి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు చేస్తే పుణ్య ఫలంతో పాటు గండాలు తొలగి వివాహం జరుగుతుందని, భక్తుల ప్రగాఢ విశ్వాసమని ఆలయ అర్చకులు అప్పాల భీమా శంకర శర్మ తెలిపారు. ఆలయ పూర్తి వివరాల లోకి వెళితే ... మన దేశం ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. మన దేశంలో ఉన్న ప్రతి ప్రసిద్ధ దేవాలయానికి ఓ చరిత్ర, ప్రాముఖ్యత, విశిష్ఠత ఉంటాయి. అలాగే, ఈ కేదారేశ్వరస్వామి వారికి మహిమాన్వితమైన శక్తులు ఉన్నాయని, ఇక్కడ పెళ్లి కాని వారు స్వామివారికి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు చేస్తే పుణ్య ఫలంతో పాటు గండాలు తొలగి వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉందో చూద్దాం…రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఈ దేవాలయం కొలువై ఉంది. ఈ ఆలయం జైనుల కాలం నాటిదని…ఆ దేవాలయంపై దర్శనమిస్తున్న రాతి శిల్ప కళ చెప్పకనే చెబుతోంది. చాళుక్య రాజులు దీనిని కట్టించారు. ఈ ఆలయంలో లింగరూపేడైన కేదారేశ్వర స్వామి వారి లింగంపై బ్రహ్మ సూక్తం ఉంటుందని, అతి ప్రాచీన శివలింగాలపై మాత్రమే ఈ బ్రహ్మ సూక్తం ఉంటుందని అర్చక స్వాములు చెబుతున్నారు. కేదారేశ్వర ఆలయ మతి పురాతనమైన ఆలయమని, ఆలయ రాతి గోడలపై అనేక రకాల దివ్యమూర్తుల ప్రతిమలు చెక్కారు. ఈ ప్రతిమలు కళానైపుణ్యం చూస్తుంటే అబ్బురపడాల్సిందే. ఆలయం మొత్తం వివిధ దేవతామూర్తులతో కనివిందు చేస్తుంది. ఆలయానికి ఆనుకుని ఉన్న అతి పురాతన విగ్రహాలు చూస్తే జైనుల శిల్ప కళ మనకు దర్శనమిస్తోంది. స్వామివారి ఆలయ ప్రధాన ద్వారం వద్ద రాతితో చెక్కబడిన శిలాశాసనం కనువిందు చేస్తుంది. ఈ శాసనంపై శివలింగం, నంది, గోమాతలతో కలిగిన శాసనం ఉంది. స్వామివారి ఆలయానికి ఉత్తరాన విష్ణుమూర్తి, దక్షిణాన బ్రహ్మదేవుని విగ్రహాలు అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. ఆలయం మొత్తం రాతితో నిర్మించారు. ఆలయ గోపురంపై దేవ దేవుళ్ళ విగ్రహాలు, రథ చక్రాలు, నటరాజ విగ్రహం, నంది, అమ్మవార్ల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయ ఆవరణంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ముందుగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం కేదారేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం విశేషం. స్వామివారిని ప్రతిరోజు అధిక సంఖ్యలో స్థానిక భక్తులు దర్శించుకుంటారు. ప్రస్తుతం ఈ దేవాలయం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు గతంలో ఈ ఆలయం తెలియకపోవడంతో భక్తుల తాకిడి తక్కువగానే ఉండేది. కానీ ప్రస్తుతం భక్తులకు తెలిసేలా స్థానిక ప్రజలు హిందూ సంఘాలు ఆలయ విశిష్టతను తెలియజేస్తున్నారు. మహా శివరాత్రి రోజు స్థానిక భక్తులు కేదారేశ్వర స్వామి వారిని అధిక సంఖ్యలో దర్శించుకొని అభిషేక పూజలు నిర్వహిస్తున్నారని ఆలయ అర్చకులు తెలిపారు.